Telugu News Telangana Janasena pac member nagababu tour in khammam district on august 1st 2022
Janasena: రేపు నాగబాబు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన .. గాయపడిన కార్యకర్తకు ఆర్ధిక సాయం అందించనున్న మెగా బ్రదర్
నాగబాబు జిలాల్లోని సత్తుపల్లిలో పర్యటించి.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తను పరామర్శించనున్నారు. బాధితుడి కుటుంబానికి దైర్యం చెప్పి.. ప్రమాద భీమాకు సంబంధించిన చెక్ ను అందజేయనున్నారని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.
Janasena: జనసేన రాయకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు తెలంగాణాలో రేపు ఆగష్టు (1వ తేదీ) పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో నాగబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యకలాపాల్లో పాల్గొననున్నారని జనసేన పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. అశ్వారావు పేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. నాగబాబు పర్యటన సందర్భగా ఇప్పటికే కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ పర్యటనలో భాగంగా నాగబాబు జిలాల్లోని సత్తుపల్లిలో పర్యటించి.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తను పరామర్శించనున్నారు. బాధితుడి కుటుంబానికి దైర్యం చెప్పి.. ప్రమాద భీమాకు సంబంధించిన చెక్ ను అందజేయనున్నారని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.