Man in Strome: కొమురం భీం జిల్లాలో పొంగిపొర్లుతున్న బాబాసాగర్ వాగు.. వాగు దాటుతూ కొట్టుకుపోయిన వ్యక్తి..
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంటలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కొమురంభీం జిల్లా చింతమానపల్లి మండలం బాబాసాగర్ గ్రామ సమీపంలో వాగు దాటుతూ ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. వరద నీరు పోటెత్తడంతో బాబాసాగర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాగు దాటుతుండగా సాయినాథ్ అనే వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కాగా నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ సాయంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. పిల్లర్‌పైన ఉన్న ఇనుప చువ్వలపై నిలుచుని రక్షించమంటూ కేకలు వేసాడు. అది గమనించిన స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

