Indiramma Housing Scheme: అదిరిపోయే గుడ్‌న్యూస్..! ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..వచ్చే వారమే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేనందు వల్ల తులం బంగారం పంపిణీ కొంత ఆలస్యమవుతున్నట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి అస్తవ్యస్ధంగా తయారైందని ఆరోపించారు. అయినా కూడా తెలంగాణ ప్రజానీకానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు..

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు తప్పకుండా అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యం 15 నెలలు పూర్తిచేసుకుందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కొన్ని ఇప్పటికే అమలు చేశామని, మిగిలినవాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి.
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసే కార్యక్రమం వచ్చే వారంలో ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేనందు వల్ల తులం బంగారం పంపిణీ కొంత ఆలస్యమవుతున్నట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి అస్తవ్యస్ధంగా తయారైందని ఆరోపించారు. అయినా కూడా తెలంగాణ ప్రజానీకానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందన్నారు. వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నామని అన్నారు. ఎక్కడా తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందన్నారు. ఇచ్చిన ప్రతి మాటను..హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.