Betel Leaf: రోజూ రెండు తమలపాకులు తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
తమలపాకు.. హిందూసాంప్రదాయంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. శుభకార్యం, పండగ, పూజాది కార్యక్రమం ఏదైనా సరే... కచ్చితంగా తమలపాకులు ఉండాల్సిందే. అయితే.. కేవలం పూజకు మాత్రమే కాదు...మన ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ తమలపాకులు ఎంతో అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారను. ప్రతిరోజూ రెండు తమలపాకులు తినడం వల్ల ఊహించని ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Mar 06, 2025 | 3:29 PM

తమలపాకులు మన జీర్ణక్రియను మెరుగపరుస్తాయి. జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి.. వాటిని నమలడం వల్ల లాలాజల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ప్రతి రోజూ రెండు తమలపాకు తినడం వల్ల నోటి దుర్వాసన దరి చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. చర్మం అందంగా కనపడటానికి కూడా సహాయపడుతుంది.

తమలపాకులు యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పని చేస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటం, మీ శ్వాసను తాజాగా ఉంచడం ద్వారా అవి నోటి పరిశుభ్రత, నోటి దుర్వాసనను దూరం చేయడానికి సహాయపడతాయి. ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్ లా పని చేస్తుంది.

తలపాకులతో తయారు చేసిన వెచ్చని, టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత తాగితే కడుపు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

తమలపాకుల్లో ఫెనోలిక్ ఆమ్లాలు ఉంటాయి. తమలపాకు తినటం వల్ల ఆందోళనా, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలు దూరమవుతాయి. ఈ ఆకుల్లో యాంటీహిస్టామైన్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఆస్తమా, కాలనుగుణ అలర్జీలతో బాధపడేవాళ్లు తమలపాకులు నమలడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది. శ్వాసకోస ఇబ్బందులకు మంచి పరిష్కారం లభిస్తుంది.




