Telangana: వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి! కుదిరితే బయటకు రాకండి
తెలంగాణలో వేసవి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో వేడి పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిది. ఎండలో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బను నివారించడానికి సరైన చర్యలు తీసుకోవాలి. వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలి.

బతుకుదెరువు కోసం ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టి, ఏదో ఒక పని చేసుకోవాల్సింది. అయితే బయటికి పని మీద వెళ్లే వాళ్లు సమ్మర్‌లో ఎక్కవగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఎండకు వెళ్తే ఇబ్బందులు తప్పవు. అయితే రానున్న రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో వీస్తున్న ఉత్తర, ఈశాన్య గాలులు ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. రాగల రెండు రోజుల తర్వాత ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి చివరి రెండు వారాలు అధికమైన ఉష్ణతాపంతో పాటు వడగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కానీ ప్రస్తుతం మొదటి వారం నుంచి ఉష్ణతాపంలో క్రమేపి పెరుగుదల కనిపిస్తుంది. ఎక్కువగా జనసాంద్రత పెరగడం.. కాంక్రీట్ ఫ్లాట్ ఫార్మ్స్ తోపాటు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ నేచర్ పెరగడం దానితోపాటు ఇండస్ట్రీస్ పెరుగుదల, ఇండస్ట్రీస్ నుంచి వెలువడే వ్యర్ధాలు వాటితోపాటు అనునిత్యం వాడే వెహికల్స్ వల్ల గాలిలో ఎక్కువ నత్రజని శాతం పెరిగిపోతుంది. అలాగే సహజ వనరుల ఉపయోగం అధికంగా ఉండటం వల్ల భూ వాతావరణం అధికంగా వేడెక్కుతుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వెల్లడించారు. అందుకే వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో బయట తిరగకపోవడం ఉత్తమం. అత్యవసరం అయితే తప్పా, మిగతా పనులు ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకుంటే మంచిది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి