Health Risk: పుచ్చకాయలు అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం.. జాగ్రత్త!!
వేసవి కాలంలో పుచ్చకాయలకు ఫుల్లు డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్‌లో ఈ పండును ఎక్కువగా తింటారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో 92శాతం నీరు, 6శాతం చక్కెర ఉంటాయి. వేసవిలో పుచ్చకాయ తినటం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో నీటి కొరతను తీరుస్తుంది. అందుకే అందరూ పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ దీన్ని అధికంగా తీసుకోవడం శరీరానికి ప్రమాదకరమని మీకు తెలుసా.? పుచ్చకాయ అతిగా తినటం వల్ల కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 07, 2025 | 7:53 AM

పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాచారం ప్రకారం, పుచ్చకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలను మరింతగా పెంచే అవకాశం ఉంది.

పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో వాపు వస్తుంది. దీనివల్ల కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. మద్యం సేవించే వ్యక్తులు దీని కారణంగా మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు డయాబెటిస్ సమస్య ఉన్నవారు పుచ్చకాయను పరిమిత పరిమాణంలో తినాలి. ఎందుకంటే ఇందులోని సహజ చక్కెర మీ బ్లడ్‌షుగర్‌ని పెంచుతుంది.

ఇందులో సిట్రుల్లైన్ అనే ఒక రకమైన అనావశ్యక అమైనో ఆమ్లం ఉంటుంది. పుచ్చకాయలోని తెల్లని భాగం తినడం వల్ల శరీరంలో దీని స్థాయి పెరుగుతుంది. సిట్రులిన్ మన రక్త నాళాలను విస్తరిస్తుంది. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం సిట్రుల్లైన్ కండరాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ఫలితంగా పనితీరు పెరుగుతుంది.

ఫైబర్ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు త్వరగా కడుపు నింపుతాయి. ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.

అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయలోని తెలుపు, ఇతర భాగాలు పెద్దలలో అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిన విషయమే.




