Telangana Elections: కరీంనగర్‌లో కీలకం కానున్న కాపుల ఓట్లు.. పోటీలో ముగ్గురు బీసీ అభ్యర్ధులు

కరీంనగర్ అసెంబ్లీ బరిలో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మున్నూరు కాపులే ఉండటం గమనార్హం. ఇక్కడ బీసీ వాదంతో ముందుకు వెళ్తున్నయి ప్రధాన పార్టీలు. కరీంనగర్‌లో ముస్లీం, మున్నూరు కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. వేలుమ సామాజికవర్గం ఇలాకలో మూడు సార్లు గెలిచి హాట్రిక్ కొట్టారు గంగుల కమలాకర్. ఇప్పుడు మూడవసారి ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తున్నారు బండి సంజయ్.

Telangana Elections: కరీంనగర్‌లో కీలకం కానున్న కాపుల ఓట్లు.. పోటీలో ముగ్గురు బీసీ అభ్యర్ధులు
Telangana Elections
Follow us
G Sampath Kumar

| Edited By: Srikar T

Updated on: Nov 11, 2023 | 3:27 PM

కరీంనగర్ అసెంబ్లీ బరిలో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మున్నూరు కాపులే ఉండటం గమనార్హం. ఇక్కడ బీసీ వాదంతో ముందుకు వెళ్తున్నయి ప్రధాన పార్టీలు. కరీంనగర్‌లో ముస్లీం, మున్నూరు కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. వేలుమ సామాజికవర్గం ఇలాకలో మూడు సార్లు గెలిచి హాట్రిక్ కొట్టారు గంగుల కమలాకర్. ఇప్పుడు మూడవసారి ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తున్నారు బండి సంజయ్. సర్పంచ్‌గా కొనసాగుతూ ఇద్దరు సీనియర్లతో సై అంటున్నారు పురుమల్ల శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారిగా ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. రాజకీయ పార్టీలు టికెట్ ఇచ్చేటప్పుడు కులాల సమీకరణాల వారిగా టికెట్లు కేటాయిస్తుంటారు. ఒక పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందిన వారికీ టికెట్ ఇస్తే మరో పార్టీ మరో బలమైన అభ్యర్థికి టికెట్ కేటయిస్తుంది. కానీ కరీంనగర్ అసెంబ్లీలో మూడు ప్రధాన పార్టీలు మున్నూరు కాపు సామజిక వర్గానికే కేటాహించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఓటింగ్ సమయానికి మున్నూరు కాపులు ఎవరి పక్షాన నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది.

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేల పోరు ఇప్పుడు మున్నూరు సామాజికవర్గ పోరుగా మారింది. ఇప్పటికే కరీంనగర్ రూరల్ మండలానికి జడ్పిటిసి సర్పంచ్‌గా పనిచేసిన పురుమల్ల శ్రీనివాస్ బరిలో నిలుస్తున్నారు. గతంలో వెలుమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో ఇప్పుడు మున్నూరు కాపుల ప్రాభల్యం పెరిగింది. అందుకే మూడు ప్రధాన పార్టీలు ముగ్గురు మున్నూరు కాపులకే తమ టికెట్లు కేటాయించాయి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లక్షల నలబై వేల ఓటర్లు ఉండగా ఇందులో ప్రధానంగా గెలుపోటములు నిర్నహించేది మున్నూరు కాపులు, ముస్లిం ఓటర్లే. ముస్లిం ఓటర్లు దాదాపుగా అరవై వేల పైచిలుకు ఉండగా.. మున్నూరు కాపుల ఓట్లు కూడా అటు ఇటుగా అదే స్థాయిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకి ఇప్పుడు ఈ రెండు సామజిక వర్గ ఓట్లే కీలకం కానున్నాయి. కరీంనగర్ టౌన్‌తో పాటుగా రూరల్ గ్రామాల్లో కూడా మున్నూరు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. లక్ష ఓట్లకి పైగా ఈ రెండు సామజిక వర్గ ఓట్లు ఉండడం‌తో అన్ని పార్టీలకి ఇవే కీలకం కానున్నాయి.

మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీ బరి నుండి నాలగవ సారి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు సార్లు గెలిచిన గంగుల కమలాకర్ కరీంనగర్‌లో రోడ్లు, కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్, ఐటి టవర్, మెడికల్ కాలేజ్, టిటిడి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ తన నియోజకవర్గానికి తీసుకువచ్చానని ప్రచారం చేసుకుంటున్నారు. బండి సంజయ్ ఎంపిగా గెలిచి రూపాయి పని చెయ్యలేదని, పురుమల్ల శ్రీనివాస్ ఒక రౌడి షీటర్ అని తానూ గెలిస్తే కరీంనగర్‌లో భూములు ఖబ్జాకి గురి అవుతాయని గంగుల అంటున్నారు. బండి సంజయ్ ప్రధానంగా కేసీఆర్, కేటీఅర్‌లను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలు గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వైపల్యం, సివిల్ సప్లై మంత్రిగా కొనసాగిన గంగుల కమలాకర్ తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇక కరీంనగర్ నగర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటి ఫండ్స్‌తోనే అభివృద్ధి అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి గంగుల కరీంనగర్ నగర అభివృద్దికి చేసింది ఏమి లేదని బండి సంజయ్ అంటున్నారు. తాను ఎంపి‌గా గెలిచిన తరువాత కరీంనగర్ పార్లమెంట్‌కి నిధులు తీసుకువచ్చానని సంజయ్ అంటునే వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి తనకి అవకాశం ఇవ్వాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్‌, కరీంనగర్ రూరల్ మండలానికి జడ్పీటీసీగా, సర్పంచ్‌గా సేవ చేసానని తనని నమ్మి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని మంత్రి గంగుల కమలాకర్‌ని ఓడించడమే తన లక్ష్యం అని ప్రచారంలో దూసుకు పోతున్నారు. కరీంనగర్‌లోని మున్నూరు కాపు సామజిక వర్గంతో పాటుగా ముస్లిం మైనారిటీ‌లలో పురుమల్ల శ్రీనివాస్‌కి మంచి పట్టు ఉండడంతో తనకే మున్నూరు కాపులు, ముస్లీం ఓట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలే తనకి శ్రీరామ రక్షా అని, జనాలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అంటున్నారు శ్రీనివాస్. కరీంనగర్ అసెంబ్లీకి ముగ్గురు కాపులే పోటీ పడుతుండడంతో కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని మున్నూరు కాపులు ఎవరి పక్షాన నిలిచి చివరకు ఎవరికీ పట్టం కడుతారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!