IRCTC: ఒకే ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ..
విజయవాడ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌లో ఏడు జ్యోతిర్లింగాలతో పాటు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని దర్శించుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. నవంబర్ 18వ తేదీన ఈ టూర్ ప్రారంభంకానుంది. విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్స్‌లో ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఈ టూర్ మొత్తం 12 రాత్రులు, 13 పగళ్లు కొనసాగుతుంది....
కార్తీక మాసంలో జ్యోతిర్లింగ దర్శనం.. ఎంతో మందికి ఒక కల. ఈ పవిత్ర మాసంలో జ్యోతిర్లింగాలను దర్శకించుకోవాలనే ఆశిస్తుంటారు. అయితే ఒకేసారి ఎక్కువ ప్రదేశాలను దర్శించడం ఇబ్బందితో కూడుకున్న విషయం. ఇలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒకే ట్రిప్‌లో ఏకంగా 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పించింది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
విజయవాడ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌లో ఏడు జ్యోతిర్లింగాలతో పాటు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని దర్శించుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. నవంబర్ 18వ తేదీన ఈ టూర్ ప్రారంభంకానుంది. విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్స్‌లో ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఈ టూర్ మొత్తం 12 రాత్రులు, 13 పగళ్లు కొనసాగుతుంది. 13 రోజుల పాటు ఈ టూర్ ప్లాన్ ఎలా ఉంటుంది.? ప్యాకేజీ ధర వివరాలు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు చూద్దాం..
* నవంబర్ 18వ తేదీన విజయవాడలో రాత్రి ఎనిమిది గంటలకు రైలు ప్రారంభంతో టూర్ మొదలవుతుంది. ఖమ్మం మీదుగా వేకువ జామున 2.42 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి నిజామాబాద్ మీదుగా మూడో రోజు ఉదయం 5.35 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. హోటల్ చెక్ ఇన్ అయిన తర్వా టిఫిన్ చేసి అనంతరం.. ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది.
* ఇక నాలుగో రోజు ఉదయం టిఫిన్ చేసి ఓంకారేశ్వర ఆలయాన్ని చేరుకుంటారు. అనంతరం అక్కడ దర్శనం పూర్తి చేసుకొని సాయంత్రం.. ఉజ్జయిని రైల్వే స్టేషన్ చేరుకొని వడోదరకు వెళ్లాల్సి ఉంటుంది.
* 5వ రోజు ఉదయం 7.30 గంటలకు వడోదరకు చేరుకుంటారు. హోటల్‌లో చెక్‌ఇన్ అయిన కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు వెళ్తారు. అనంతరం ద్వారకకు బయల్దేరుతారు.
* ఇక ఆరో రోజు ద్వారకలో ద్వారకాదీశ్ ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రి అక్కడే బస చేయాలి.
* 7వ రోజు ఉదయం టిఫిన్ పూర్తయ్యాక.. బెట్ ద్వారాకతో పాటు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించుకుంటార. అనంతరం సాయంత్రానికి ద్వారాక చేరుకొని ఆ తర్వాత సోమనాథ్‌కు వెళ్తారు.
* 8వ రోజు సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. అనంతరం సోమనాథ్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని మళ్లీ ప్రయాణం మొదలవుతుంది.
* ఇక 9వ రోజు రాత్రి నాసిక్‌లో బస చేయాల్సి ఉంటుంది. అనంతరం 10వ రోజు ఉదయం టిఫిన్ కాగా త్రయంబకేశ్వరున్ని సందర్శించి తిరిగి నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్‌కు వచ్చి పుణెకు పయనమవుతారు.
* 11వ రోజు ఉదయం టిఫిన్ చేశాక భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. అనంతరం ఔరంగాబాద్ బయల్దేరతారు.
* 12వ రోజు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
* 13వ రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు విజయవాడకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధర వివరాలు..
స్లీపర్ క్లాస్‌లో ప్రయాణానికి ట్విన్, ట్రిపుల్ షేరింగ్ రూ. 21,000గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు రూ. 19,500గా నిర్ణయించారు. ఇక థర్డ్ ఏసీలో అయితే ట్విన్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 32,500, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారలకు రూ. 31,000గా నిర్ణయించారు. 2ఏసీ ప్రయాణానికి ట్విన్, ట్రిపుల్ షేరింగ్ రూ. 42,500కాగా, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 40,500గా నిర్ణయించారు. ఉదయం టీ, టిఫిన్, లంచ్, రాత్రి భోజనం అంతే ప్యాకేజీలో కవర్ అవుతుంది. రాత్రి బస కూడా ప్యాకేజీలోనే ఉంటుంది. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..