AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: వరంగల్ తూర్పు .. చరిత్ర తిరగ రాస్తారా..? మళ్లీ గెలుపు యోగం ఉందా..?

ఆ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయం ముఖచిత్రంలో ఆసక్తికర చర్చగా మారింది. ఎంతటి ఉద్దండులైనా సరే, ఒక్కసారికి మించి గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఒక కారణంతో వారికి పదవి గండం తప్పడం లేదు. మరి ఈసారి పోటీ చేసే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ చరిత్ర తిరగ రాస్తారా..? మళ్లీ గెలుపు యోగం ఉందా..? అక్కడి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..?

Telangana Election: వరంగల్ తూర్పు .. చరిత్ర తిరగ రాస్తారా..? మళ్లీ గెలుపు యోగం ఉందా..?
Warangal East Politics
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 11, 2023 | 2:08 PM

Share

ఆ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయం ముఖచిత్రంలో ఆసక్తికర చర్చగా మారింది. ఎంతటి ఉద్దండులైనా సరే, ఒక్కసారికి మించి గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఒక కారణంతో వారికి పదవి గండం తప్పడం లేదు. మరి ఈసారి పోటీ చేసే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ చరిత్ర తిరగ రాస్తారా..? మళ్లీ గెలుపు యోగం ఉందా..? అక్కడి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

రాజకీయ చైతన్యానికి, ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ ఓరుగల్లు. ఎంతోమంది గొప్ప గొప్ప నేతలకు రాజకీయ జన్మనిచ్చిన గడ్డ ఈ అడ్డ. అలాంటి ఓరుగల్లు గడ్డపైన ఓ విచిత్ర తీర్పు ఆసక్తికరంగా మారింది. అదే వరంగల్ నియోజకవర్గం. వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత ఎవరైనా ఒక్కసారికి మించి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన చరిత్ర లేదు. మంచి మంచి దిగ్గజాలకు కూడా ఇక్కడ రెండోసారి ఓటమి తప్పలేదు.

వరంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009లో అప్పటి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఇక్కడి నుండి గెలుపొందారు. నియోజకవర్గం పునర్విభజనకు ముందు వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన ఆయన, 2014 ఎన్నికల్లో కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బస్వరాజు సారయ్య కూడా BRS పార్టీలో చేరారు. ఊహించని పరిణామాలు నేపథ్యంలో 2018 ఎన్నికల్లో కొండా సురేఖకు టిక్కెట్ దక్కలేదు. దీంతో BRSను వీడి కాంగ్రెస్ లో చేరారు కొండా సురేఖ దంపతలు.. ఏకంగా ఈ నియోకవర్గాన్నే వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 లో పరకాల నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2009 నుంచి ఇప్పటి వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినవారు లేరు.

ఇక, 2018 ఎన్నికల్లో BRS అభ్యర్థి నన్నపునేని నరేందర్ ఇక్కడి నుండి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నరేందర్ తిరిగి మళ్లీ అధికార BRS పార్టీ నుండి టిక్కెట్ సాధించి బరిలోకి దిగారు. ఆయనపై సొంత పార్టీలోనే ఇప్పుడు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడం ఓరుగల్లు హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుందా..? అనే చర్చ జరిగుతుంది..! వరంగల్ తూర్పులో కొనసాగుతున్న చరిత్ర రిపీట్ అవుతుందా..? సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ ఆ చరిత్ర ను తిరగ రాస్తారా..? అనే చర్చ ఇప్పుడు ఓరుగల్లు వాసుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి