AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం’.. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ..

నిర్మల్‌లో జరిగిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో కేంద్రం, బీజేపీపై మండిపడ్డారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. దేశంలోని ప్రజలు, బడుగు బలహీనవర్గాలకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించిందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు రాహుల్. ఈసందర్భంగా బీజేపీపై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ అంటోందని రాహుల్ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారు రాహుల్ గాంధీ. ఇది దేశ ముఖచిత్రాన్ని మారుస్తుందన్నారు.

'దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం'.. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ..
Rahul Gandhi
Srikar T
|

Updated on: May 05, 2024 | 3:07 PM

Share

నిర్మల్‌లో జరిగిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో కేంద్రం, బీజేపీపై మండిపడ్డారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. దేశంలోని ప్రజలు, బడుగు బలహీనవర్గాలకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించిందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు రాహుల్. ఈసందర్భంగా బీజేపీపై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ అంటోందని రాహుల్ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారు రాహుల్ గాంధీ. ఇది దేశ ముఖచిత్రాన్ని మారుస్తుందన్నారు. ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటనే అంశంపై సమగ్రమైన సర్వే చేస్తామని చెప్పారు. అప్పుడు వారికి ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుందన్నారు.

తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ కూడా ఇందులో భాగమే అన్నారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి తాము కృషి చేస్తున్నమన్నారు. ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ధనవంతులకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారని చెప్పారు. తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని.. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. దేశవ్యాప్తంగా గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పెంచుతామన్నారు. అన్ని రంగాలను మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..