పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవాన్ని పొందిన కలశ నాయుడు..

యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ 11 ఏళ్ల చిన్నారికి డాక్టరేట్‎ను ప్రదానం చేసింది. కలశ నాయుడు అనే పసి తనువు పుట్టగానే పులకరించింది. సమాజం కోసం పరితపించింది. తనకు సమాన వయసులో ఉండే పసిపిల్లలు పలక, బలపం పట్టుకోవల్సిన చేతులు పని ముట్లను పట్టుకోవడాన్ని చూసి తల్లడిల్లి పోయింది. తన వంతు సేవ చేయాలని ధాతృత్వాన్ని చాటుకుంది. అలా కష్టపడుతున్న చిన్నారులకు పలకలు, బలపాలు, చాక్లెట్లు, పెన్సిళ్లు, నోట్ బుక్‎లు, ఆట బొమ్మలు అందించింది. వీటితో పాటు వెల కట్టలేనంత ప్రేమను పంచింది.

పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవాన్ని పొందిన కలశ నాయుడు..
Kalasha Naidu
Follow us

|

Updated on: May 05, 2024 | 3:59 PM

యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ 11 ఏళ్ల చిన్నారికి డాక్టరేట్‎ను ప్రదానం చేసింది. కలశ నాయుడు అనే పసి తనువు పుట్టగానే పులకరించింది. సమాజం కోసం పరితపించింది. తనకు సమాన వయసులో ఉండే పసిపిల్లలు పలక, బలపం పట్టుకోవల్సిన చేతులు పని ముట్లను పట్టుకోవడాన్ని చూసి తల్లడిల్లి పోయింది. తన వంతు సేవ చేయాలని ధాతృత్వాన్ని చాటుకుంది. అలా కష్టపడుతున్న చిన్నారులకు పలకలు, బలపాలు, చాక్లెట్లు, పెన్సిళ్లు, నోట్ బుక్‎లు, ఆట బొమ్మలు అందించింది. వీటితో పాటు వెల కట్టలేనంత ప్రేమను పంచింది. దీనిని గుర్తించిన కలశ నాయుడు తల్లిదండ్రులు పుత్రికా వాత్సల్యంలో పొంగిపోయారు. ఆమె చేసే ప్రతిపనికి ఊతం ఇచ్చారు. సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపించారు. ఇలా కలశకు స్వేచ్ఛను ఇచ్చి సమాజానికి చేయూత ఇవ్వమని ప్రోత్సహించారు. ఇంకేముంది.. ఇంతింతై, వటుడింతై, విశ్వమంతై, ఖండఖండాలపైనంతై అని వామనుడు కాలు మోపినట్లుగా విస్తరించింది ఆ పసిబాలిక సేవా గుణం. అది కాస్త కలశ ఫౌండేషన్‎గా మారింది.

కలశ నాయుడు ఆగస్టు 13, 2013లో దానగుణ దేహమై భువిపై అడుగిడింది. ఆ తరువాత ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసిన పేరెంట్స్ కలశ ఫౌండేషన్ స్థాపించారు. దీనిని ప్రారంభించిన తొలినాళ్లలో అక్షర కలశం పేరుతో విద్యను అందించేందుకు ముందుకొచ్చారు. అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం అంటూ ఉంటారు. కానీ ఇది పొరపాటు. అన్నం ఆకలిని గుర్తుకు చేస్తుంది. అదే విద్య సంపదను, సమాజ శ్రేయస్సును కలిసిస్తుంది. తద్వారా పదిమందికి సహాయపడుతుంది. అందుకే అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పది అంటారు. ఇలా అక్షర కలశంతో ప్రారంభమైన ప్రస్థానం మరెన్నో మైలు రాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగింది.

గ్రీన్ లేస్ సొసైటీతో భాగస్వామ్యమై పర్యావరణంపై అవగాహన కల్గించడం. చెట్లను నాటడం వంటి అనేక సమాజ హిత కార్యక్రమాలను ప్రారంభించారు. ఇలా చేయడం ద్వారా నగర వాసుల్లో పర్యావరణ స్పృహ తట్టిలేపి గ్రీన్ ఇండియా దిశగా అడుగులు వేసేలా సరికొత్త అధ్యాయానికి నాందిపలికింది. దీంతో పాటు చాణక్య పొలిటికల్ అవార్డ్స్ పేరుతో విన్నూత్న కార్యక్రమానిక శ్రీకారం చుట్టారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో చైతన్యం తెస్తూనే రాజకీయాలపై కూడా తమ దృష్టిని కేంద్రీకరించారు. రాజకీయ రంగంలో సత్తా చాటుతున్న నాయకులకు, ప్రతినిధులకు చాణక్య అవార్డ్స్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. రాజనీతి శాస్త్రంలో అపర మేధావి అయిన చాణుక్యుడి పేరుమీద ఈ అవార్డును రూపొందించారు. రాజకీయాలు అంటే ప్రజల్లో మంచి ఉద్దేశం కల్పించడం కోసం, రాజకీయాల్లో నిజాలే చెప్పేలా ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్థిక రంగంలోనూ అడుగు పెట్టి సత్ఫలితాలను పొందుతున్నారు. స్వయం ఉపాధి కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళకు ఉపాధి చేకూరుస్తున్నారు. మహిళా శక్తిని దేశానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ముఖ్య ఉద్దేశం మహిళా స్వావలంబన అని చెబుతున్నారు. దీంతో పాటు గ్రామీణాభివృద్దికి దోహదపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇలా పిట్ట కొంచెం కూత ఘనం అన్న విధంగా కేవలం 11 ఏళ్ల చిన్నారి ఇంతటి అపారమైన సేవాప్రతిభను కనబరిచినందుకు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ గుర్తించి డాక్టరేట్‎ను ప్రదానం చేసింది. లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయసులోనే డాక్టరేట్ బిరుదును పొందిన తొలి చిన్నారిగా రికార్డుకు ఎక్కింది. బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్‎లోని ఇండియన్ హైకమీషనర్‎తోపాటు అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించింది. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈ కార్యక్రమానికి రాలేకపోయినందుకు చింతిస్తున్నానని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..