AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Burra Venkatesham: ట్యూషన్ మాస్టర్ నుంచి టీజీపీఎస్సీ చైర్మన్ దాకా.. అంచెలంచెలుగా సాగిన బుర్రా వెంకటేశం జర్నీ!

ఐఏఎస్ సీనియర్ అధికారి అయిన బుర్రా వెంకటేశం జనగాం జిల్లా ఓబుల్ కేశవాపురానికి చెందిన వ్యక్తి. వరంగల్, నల్గొండ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి పూర్తి చేసిన వెంకటేశం ఇంటర్ మీడియట్ కోసం హైదరాబాద్ వచ్చారు.

Burra Venkatesham: ట్యూషన్ మాస్టర్ నుంచి టీజీపీఎస్సీ చైర్మన్ దాకా.. అంచెలంచెలుగా సాగిన బుర్రా వెంకటేశం జర్నీ!
Burra Venkatesham Ias
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 30, 2024 | 1:33 PM

Share

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశంను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో డిసెంబర్ 2న బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. బుర్రా వెంకటేశంకు ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. 2030 వరకు ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగనున్నారు. ప్రభుత్వం మొదటి నుంచి పూర్తి స్థాయి ఆరేళ్ల చైర్మన్‌ను నియమించాలని అనుకుంది. ఈ క్రమంలోనే బుర్రా వెంకటేశంను ఎంపిక చేసింది.

ఐఏఎస్ సీనియర్ అధికారి అయిన బుర్రా వెంకటేశం జనగాం జిల్లా ఓబుల్ కేశవాపురానికి చెందిన వ్యక్తి. వరంగల్, నల్గొండ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి పూర్తి చేసిన వెంకటేశం ఇంటర్ మీడియట్ కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చేస్తూ.. షేక్‌పేట్ పరిధిలో హోమ్ ట్యూషన్స్ చెబుతూనే విద్యా బోధన సాగించారు. 1990 లో మొదటి అటెంప్ట్ లోనే సివిల్స్ రాసి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించారు. 1995లో మరోసారి సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించారు.

1996లో ఆదిలాబాద్ జిల్లా ట్రైన్ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు కలెక్టర్‌గా పని చేసిన బుర్రా వెంకటేశం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన వెంకటేశం, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా, రాష్ట్ర గవర్నర్‌కు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహస్తున్నారు.

పుస్తకాలు, సాంగ్స్ కూడా బుర్రా వెంకటేశం రాశారు. ఆయన రాసిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ ఇంగ్లీష్ పుస్తకం, గెలుపు పిలుపు వంటివి ప్రాచుర్యం పొందినవి. బతుకమ్మ తోపాటు తల్లిదండ్రుల గొప్పతనాన్ని వివరించే “అమ్మగీసీన బొమ్మను నేను” అనే అద్భుతమైన పాటలు రాశారు. అంచెలంచెలగా ఎదిగి నిత్యకృషివలుడిగా పేరుపొందారు. ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ గా ఎంపిక కావడంతో విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..