AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ !!

Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ !!

Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 30, 2024 | 1:53 PM

Share

రేపో.. మాపో గుడ్‌ న్యూస్‌..! అంటోంది రేవంత్‌ సర్కార్. మరి తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు చెప్పే ఆ గుడ్‌ న్యూస్‌ ఏంటి..? రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతుభరోసా ప్రకటిస్తారా..? ఇంతకూ ప్రభుత్వంపై రైతులకున్న అంచనాలేంటి.. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏడాది పాలన పూర్తిచేసుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది.

ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. రైతులకు సంబంధించిన కీలక అంశాలను సీఎం చెబుతారని మంత్రి ప్రకటించడంతో.. రేవంత్‌ ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటనే ఆసక్తి రేపుతోంది. రైతుభరోసా అమలుపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కొంతమంది అంచనా వేస్తుంటే.. మరికొంతమంది మాత్రం పూర్తి రుణమాఫీపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. మరోవైపు రుణమాఫీ సంపూర్ణం చేస్తారన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే రైతుభరోసాకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ సబ్‌కమిటీ వేశారు. నివేదిక వచ్చే వరకూ ఆగక తప్పదు. అంటే రైతు భరోసాపై అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టే..! అందువల్ల రుణమాఫీ పెండింగ్‌లో ఉన్న రైతులకు రేవంత్ శుభవార్త చెప్పబోతున్నారా.. లేక ఇంకేదైనా కొత్తగా పథకం ఉండబోతోందా? అనే చర్చ నడుస్తోంది. ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా మూడ్రోజులపాటు జరిగే రైతు పండగ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. ఆ సందర్భంగా ఆయనిచ్చే తాయిలం ఏంటో తెలియాలంటే.. 30వ తేదీ దాకా వెయిట్‌ చేయాల్సిందే..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రంప్ ప్రాణాలకు ముప్పుందా ?? పుతిన్‌ మాటలకు అర్థమేంటి ??

బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా.. పది మంది మృతి, పలువురికి గాయాలు

Cyclone Fengal: ఫెంగల్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో ఎక్కడెక్కడ ??

మరో మూవీ నుంచి దేవీ అవుట్‌ ?? మైత్రీతో దేవీకి సమ్ థింగ్, సమ్ థింగ్

Pragya Jaiswal: ఆ క్రికెటర్‌తో డేటింగ్‌ చేయాలని ఉంది..