బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా.. పది మంది మృతి, పలువురికి గాయాలు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. భండారా నుంచి గోండియా వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. గోండియా జిల్లాలోని సడక్ అర్జుని సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బైక్‌ను తప్పించే ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం భండారా నుంచి బయల్దేరిన బస్సు కోహ్‌మారా హైవేపై వెళ్తుండగా ఉన్నట్టుండి ఓ ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చింది. దాని తప్పించే క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా బస్సును ఇంకోవైపునకు తిప్పడంతో బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cyclone Fengal: ఫెంగల్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో ఎక్కడెక్కడ ??
మరో మూవీ నుంచి దేవీ అవుట్ ?? మైత్రీతో దేవీకి సమ్ థింగ్, సమ్ థింగ్
Pragya Jaiswal: ఆ క్రికెటర్‌తో డేటింగ్ చేయాలని ఉంది..
Trisha: ప్రభాస్ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!
ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్