ట్రంప్ ప్రాణాలకు ముప్పుందా ?? పుతిన్ మాటలకు అర్థమేంటి ??
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్‌కు ప్రాణహాని ఉందా? అధ్యక్షుడైనా కూడా సేఫ్ జోన్‌లో ఉండడా? అంటే అవుననే అంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఏమాత్రం సేఫ్ గా లేరని పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఒకటికి రెండుసార్లు ట్రంప్ పై హత్యాయత్నం జరగడం
మరోసారి ట్రంప్ సభకు ఓ అనుమానితుడు ఆయుధాలతో హాజరుకావడం తదితర సంఘటనలను పుతిన్ ప్రస్తావించారు. అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం అసాధారణమేమీ కాకున్నా వెంటవెంటనే జరగడం అనుమానించాల్సిందే అన్నాడు. తన అంచనా ప్రకారం ప్రస్తుతం ట్రంప్ డేంజర్ లోనే ఉన్నాడని చెప్పారు. అయితే, ట్రంప్ చాలా తెలివైన నాయకుడు అని ప్రశంసలు గుప్పించారు. తనకు పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకుని ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రత్యర్థులు ఆయన పిల్లలను, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పుతిన్ పేర్కొన్నారు. ట్రంప్ ను ఎదుర్కొనేందుకు ఆయన ప్రత్యర్థులు అనాగరిక పద్ధతులు ఎంచుకున్నారని విమర్శించారు. మరోవైపు, ఉక్రెయిన్ విషయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీరు సరికాదని పుతిన్ మండిపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా.. పది మంది మృతి, పలువురికి గాయాలు
Cyclone Fengal: ఫెంగల్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో ఎక్కడెక్కడ ??
మరో మూవీ నుంచి దేవీ అవుట్ ?? మైత్రీతో దేవీకి సమ్ థింగ్, సమ్ థింగ్
Pragya Jaiswal: ఆ క్రికెటర్‌తో డేటింగ్ చేయాలని ఉంది..
Trisha: ప్రభాస్ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!