Cyclone Fengal: ఫెంగల్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో ఎక్కడెక్కడ ??

Cyclone Fengal: ఫెంగల్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో ఎక్కడెక్కడ ??

Ravi Kiran

| Edited By: Phani CH

Updated on: Nov 30, 2024 | 1:48 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దీని ప్రభావం మూడు రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తోంది. తమిళనాడు, ఏపీ, కర్నాటకతో పాటు పుదుచ్చేరిపై పడింది. ప్రత్యేకించి- తమిళనాడు, పుదుచ్చేరిలపై పంజా విసురుతోంది. ఈరోజు పుదుచ్చేరిలోని కారైకల్‌, తమిళనాడులోని మహాబలిపురం తీరాన్ని ఈ తుపాను తాకనుంది.

దీని ప్రభావంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఫెంగల్ తుపాను ఈరోజు పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దీంతో పాఠశాలలు, స్కూళ్లను మూసివేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచనలు జారీ చేశారు. కాగా ఫెంగల్ తుఫాన్ గంటకు 7 కి.మీ. వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరికి 180 కి.మీ, చెన్నైకి 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి 70-90కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో మూవీ నుంచి దేవీ అవుట్‌ ?? మైత్రీతో దేవీకి సమ్ థింగ్, సమ్ థింగ్

Pragya Jaiswal: ఆ క్రికెటర్‌తో డేటింగ్‌ చేయాలని ఉంది..

Trisha: ప్రభాస్‌ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!

ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్

TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై