Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Gay Wedding in TS: బంధువుల సమక్షంలో వైభంగా పెళ్లి చేసుకున్న ఇద్దరు పురుషులు.. తెలంగాణలో మొదటి ‘గే’ వివాహం

First Gay wedding in Telangana: ప్రేమ అంటే ఏమిటి.. అంటే ఒకొక్కరు ఒక్క అర్ధం చెప్పారు. ప్రేమ గుడ్డిది.. మంచి, చెడు, వయసు, రంగు, కులం ఇలా వేటితోనూ ప్రేమకు సంబంధం లేదని అంటారు...

First Gay Wedding in TS:  బంధువుల సమక్షంలో వైభంగా పెళ్లి చేసుకున్న ఇద్దరు పురుషులు.. తెలంగాణలో మొదటి 'గే' వివాహం
First Gay Wedding In Telang
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Dec 19, 2021 | 6:54 PM

First Gay wedding in Telangana: ప్రేమ అంటే ఏమిటి.. అంటే ఒకొక్కరు ఒక్క అర్ధం చెప్పారు. ప్రేమ గుడ్డిది.. మంచి, చెడు, వయసు, రంగు, కులం ఇలా వేటితోనూ ప్రేమకు సంబంధం లేదని అంటారు.. అయితే విదేశాల్లో ప్రేమకు జెండర్ తో కూడా సంబంధం లేదు.. అక్కడ అమ్మాయి, అమ్మాయిని , అబ్బాయిని అబ్బాయి ప్రేమించవచ్చు.. ఆ ప్రేమ మరింత ఎక్కువైతే.. జీవితాంతం కలిసి ఉండడానికి పెళ్లి కూడా చేసుకోవచ్చు.. అక్కడ ఇలాంటి పెళ్లిళ్లు సర్వసాధారణం కూడా.. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అడుగు పెడుతోంది. తాజాగా ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణాలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా రికార్డ్ సృష్టించారు.

ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకున్నా లేదా ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకున్న సంఘటనలు భారత్ లో బహు అరుదు. ఇక  మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు ఇలాంటివి జరిగిన దాఖలాలే లేవు. మొదటిసారిగా తెలంగాణలో ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సుప్రియో, అభయ్ ల స్నేహం ప్రేమగా మారింది.

ఇప్పుడు పెద్దల అనుమతితో అంగరంగ వైభంగా పెళ్లి కూడా చేసుకున్నారు.  సుప్రియో హైదరాబాద్‌లో.. హోటల్‌ మెనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా.. అభయ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు.

తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు(గే) చేసుకుంటున్న తొలి వివాహం ఇదే. ఈ  వివాహ వేడుక సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్‌ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో శనివారం జరిగిన తెలంగాణ తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు.

Also Read: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

మరో కొత్త పథకానికి స్టాలిన్ శ్రీకారం.. రోడ్డు ప్రమాద బాధితులకు 48 గంటలు ఉచిత చికిత్స..