Shyam Singha Roy: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నాని శ్యాం సింగ రాయ్ బృందం..ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాని పిలుపు..
Shyam Singha Roy: తెలంగాణా రాష్ట్రాన్ని హరితహారం చేసే దిశగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్..
Shyam Singha Roy: తెలంగాణా రాష్ట్రాన్ని హరితహారం చేసే దిశగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో కార్యక్రమాన్ని సినీ సా సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, సామాన్యులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా జూబ్లీహిల్స్ ప్రసాసన్ నగర్ లోని జీహెచ్ఎంసి పార్క్ లో హీరో నాని, హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి, నిర్మాత బోయినపల్లి వెంకట్ లు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు ఇలా అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని నాని అన్నారు. గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దోహదపడుతుందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం గ్రీన్ఇండియా చాలెంజ్ కరుణాకర్ రెడ్డి, రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి అందజేశారు. ప్రకృతి పై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ పై నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రశంసల జల్లు కురిపించారు.
Also Read: బంధువుల సమక్షంలో వైభంగా పెళ్లి చేసుకున్న ఇద్దరు పురుషులు.. తెలంగాణలో మొదటి ‘గే’ వివాహం