Babu Mohan: బాబూమోహన్ టీడీపీలో చేరబోతున్నారా..? చంద్రబాబుతో భేటి వెనుక ప్లాన్ అదేనా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు.. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం టీటీడీపీ నేతలతో సుధీర్ఘంగా చర్చించారు.. ఈ క్రమంలోనే కమిటీలన్నింటిని రద్దు చేస్తున్నామని.. త్వరలోనే సభ్యత్వాలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు.. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం టీటీడీపీ నేతలతో సుధీర్ఘంగా చర్చించారు.. ఈ క్రమంలోనే కమిటీలన్నింటిని రద్దు చేస్తున్నామని.. త్వరలోనే సభ్యత్వాలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు.. అయితే.. ఈ నెల 25న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ సమావేశం జరగగా.. అక్కడ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.. అక్కడ మాజీ మంత్రి, వెటరన్ కమెడియన్ బాబుమోహన్ చంద్రబాబుని కలిసి మాట్లాడారు.. చంద్రబాబుతో భేటీ సమయంలో బాబుమోహన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వీడిపోవడం వల్లే ఇబ్బందులు పడ్డానని, తనకు అవకాశం ఇస్తే మళ్ళీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చంద్రబాబుని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని సమచారం.. అయితే.. చంద్రబాబును కలవడం, సుదీర్ఘ సమయం చర్చించడంతో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బాబూ మోహన్ త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం ప్రారంభమైంది.
దీంతో ఇటీవల కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీతో సన్నిహితంగా ఉన్న బాబు మోహన్.. మళ్లీ సొంత గూటికి చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పట్లో కూడా ప్రజాశాంతి పార్టీలో చేరలేదని, కానీ తనతో ఉన్న చనువు వల్ల కేఏ పాల్ తనకు మెడలో కండువా వేసారే తప్ప జాయిన్ అవ్వలేదని బాబూమోహన్ ప్రకటించడం సంచలనంగా మారింది.. తాజాగా.. బాబూమోహన్ చంద్రబాబును కలకవడంతో.. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన పార్టీలోకి మళ్ళీ చెరబోతున్నారన్న చర్చ తెలుగుదేశం పార్టీలో మొదలైంది..
బాబూ మోహన్ ట్రాక్ ఇదే…
ఉమ్మడి రాష్ట్రంలో 1998లో అందోల్‌లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన బాబూ మోహన్ 1999 సాధారణ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ఆ తరువాత కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. . అయితే 2018 లో కేసీఆర్ ఆయనను పక్కన పెట్టి జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు టికెట్ ఇచ్చారు.. దీంతో బాబూమోహన్ బీజేపీ లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2023 లోనూ దామోదర్ రాజనర్సింహ చేతిలో ఓడిపోయాక కేఏ పాల్ పెట్టిన ప్రజాశాంతి పార్టీకి సన్నిహితంగా ఉంటూ వచ్చారు.
సొంత గూటికే ఎందుకంటే…
ఇప్పటివరకు కేఏ పాల్ తో ఉన్న బాబూమోహన్.. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ లో పార్టీని బలోపేతం చేయాలని కసరత్తు చేస్తున్న చంద్రబాబు ఆయనకు ఒక ఆశా కిరణం లా కనిపించార. ఇప్పటికే టీఆర్ఎస్, బిజెపితో బంధం తెంచుకున్న బాబూ మోహన్ ఎలాగూ కాంగ్రెస్లోకి వెళ్లలేరు.. కాంగ్రెస్ నుంచి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది దామోదర రాజనర్సింహా.. కావున ఇక మిగిలిన ఏకైక ఆప్షన్ తెలుగుదేశం.. కాబట్టి ఇక ఏ మాత్రం ఆలోచించకుండా బాబు మోహన్ తెలుగుదేశం వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.
అది కూడా తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ కావడం, సినీ నటుడు అయినా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి కూడా నాయకత్వం అవసరమైన నేపథ్యంలో టిడిపిలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..