బోటులో షికారు చేస్తూ బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలని ఉందా.? హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న ఈ స్పాట్‌పై ఓ లుక్కేయండి.

హైదరాబాద్‌ అంటేనే రణగొణ ధ్వనులు, ట్రాఫిక్‌ పద్మవ్యూహం, ఇంటి నుంచి కాలు బయట పెడితే తిరిగి ఇంటికి ఎప్పుడు చేరకుంటామో తెలియని పరిస్థితి. వారం రోజుల పాటు గజిబిజీ లైఫ్‌కి సండే ఒక్క రోజు రిలీఫ్‌ ఇవ్వాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్లానింగ్స్‌ చేసుకుంటుంటారు. మరీ ముఖ్యంగా ఒక్క...

బోటులో షికారు చేస్తూ బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలని ఉందా.? హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న ఈ స్పాట్‌పై ఓ లుక్కేయండి.
Floating Boat Breakfast
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 20, 2023 | 11:35 AM

హైదరాబాద్‌ అంటేనే రణగొణ ధ్వనులు, ట్రాఫిక్‌ పద్మవ్యూహం, ఇంటి నుంచి కాలు బయట పెడితే తిరిగి ఇంటికి ఎప్పుడు చేరకుంటామో తెలియని పరిస్థితి. వారం రోజుల పాటు గజిబిజీ లైఫ్‌కి సండే ఒక్క రోజు రిలీఫ్‌ ఇవ్వాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్లానింగ్స్‌ చేసుకుంటుంటారు. మరీ ముఖ్యంగా ఒక్క రోజులో ఇంటికి రిటర్న్‌ అయ్యేలా టూర్స్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. మీలాంటి వారి కోసమే ఓ సంస్థ సూపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. బోటులో సరదగా షికారు చేస్తూ బ్రేక్‌ ఫాస్ట్ చేసే అవకాశం కల్పించింది. ఇంతకీ ఆ స్పాట్‌ ఏంటి.? ఎక్కడుంది.? లాంటి వివరాలు మీకోసం..

హైదరాబాద్‌కు 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి గిల్స్‌ దగ్గరే ఉందా స్పాట్‌. నిజానికి చాలా మంది హైదరాదీలు వీకెండ్స్‌లో అనంతగిరిని విజిట్‌ చేస్తున్నారు. ట్రెక్కింగ్‌, బోటింగ్‌ వంటి సదుపాయాలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకోవడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ఓ సంస్థ వినూత్న ప్లాన్‌ చేసింది. బోటులో ఒకేసారి నలుగురి కూర్చొని టిఫిన్‌ చేస్తూ అలా సరాదగా నీటిలో రైడ్‌ చేసే ఏర్పాటు చేశారు. ది వైల్డర్‌నెస్‌ రీట్రీట్ అనే సంస్థ ఈ సదవకాశాన్ని కలిపించింది.

ఇవి కూడా చదవండి

బోటులో షికారు చేస్తూ టిఫిన్‌ చేయాలంటే నలుగురికి కలిపి రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్‌ టిఫిన్‌ను అందిస్తారు. నిత్యం ట్రాఫిక్‌ గందరగోళంలో చిక్కుకునే సగటు నగర పౌరుడికి ఇది చాలా రిలీఫ్‌ ఇస్తుందని ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చెబుతున్నారు. నీటిలో తేలుతూ, ఎలాంటి పొల్యూషన్‌లేని చోట ఇలా బోట్‌ రైడ్‌ విత్ టిఫిన్‌ ఐడియా నిజంగానే బాగుంది కదూ! మరెందుకు ఆలస్యం వచ్చే వీకెండ్‌కి మీ ఫ్రెండ్స్‌తో మీరు కూడా ఓ ట్రిప్‌ వేసేయండి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..