Hyderabad: నగరవాసులకు ముఖ్య గమనిక.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా ఫేస్-2 లో గంగారం వద్ద 1500 ఎంఎం డయా పీఎస్ఈ పైపులైన్ కు ఏర్పడ్డ భారీ లీకేజీని అరికట్టడానికి అత్యవసరంగా మరమ్మతు పనులు చేపడుతున్నారు.
హైదరాబాద్ నగర వాసులకు ముఖ్య గమనిక. బుధవారం (డిసెంబర్ 14)న చాలాచోట్ల మంచి నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా ఫేస్-2 లో గంగారం వద్ద 1500 ఎంఎం డయా పీఎస్ఈ పైపులైన్ కు ఏర్పడ్డ భారీ లీకేజీని అరికట్టడానికి అత్యవసరంగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా బుధవారం రోజు కింద పేర్కొన్న ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 24 గంటల్లో మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
నీటి సరఫరా అంతరాయం ఉండే ప్రాంతాలు..
చందానగర్, గంగారం, హుడా కాలనీ, మదీనా గూడ, దీప్తి శ్రీ నగర్, హఫీజ్ పేట్, మియాపూర్, బొల్లారం, నిజాంపేట్, బాచుపల్లి, హైదర్ నగర్ రిజర్వాయర్ ప్రాంత పరిధిలో కేపీ హెచ్ బీ ప్రాంతంలోని ప్రగతి నగర్, వసంత నగర్, హైదర్ నగర్.
ఈ సమయంలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోనుందని.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులు తెలియజేశారు జల మండలి అధికారులు . నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..