Veldanda SI Arrest: ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్‌ఐ.. ఏసీబీ వలకి చిక్కిన మరో అవినీతి తిమింగళం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తు్న్న ఎస్‌ఐ రవికుమార్‌ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ కేసులో నిందితుడి నుంచి ఎస్సై లంచం అడిగినట్టుగా ఏసీబీకి సమాచారం అందింది. దీంతో మాటువేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా ఎస్‌ఐ రవికుమార్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు..

Veldanda SI Arrest: ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్‌ఐ.. ఏసీబీ వలకి చిక్కిన మరో అవినీతి తిమింగళం
Veldanda SI Arrest
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2024 | 5:11 PM

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 26: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తు్న్న ఎస్‌ఐ రవికుమార్‌ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ కేసులో నిందితుడి నుంచి ఎస్సై లంచం అడిగినట్టుగా ఏసీబీకి సమాచారం అందింది. దీంతో మాటువేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా ఎస్‌ఐ రవికుమార్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్‌ కథనం ప్రకారం..

కల్వకుర్తి పట్టణంలోని తిలక్‌నగర్‌ చెందిన డేరంగుల వెంకటేశ్‌ అనే వ్యక్తి ఇంటిపై ఈనెల 17న వెల్దండ పోలీసులు దాడి చేశారు. అతడి ఇంట్లో రాళ్లు పగులగొట్టేందుకు వినియోగించే మందుగుండు సామగ్రి కలిగిన 7 పెట్టెల జిలిటెన్‌ స్టిక్స్, 2 పెట్టెల డిటోనేటర్లను నిల్వ చేసినట్లు వెల్దండ పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో అతడిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఎస్సై రవికుమార్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు వెంకటేశ్‌ జూన్‌ 19న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎస్సై సూచన మేరకు వెంకటేశ్‌ అతడికి లంచం ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే లంచం నేరుగా ఎస్సైకి ఇవ్వకుండా మూడో వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు. ఈ మేరకు ఎస్సై నేరుగా మాట్లాడకుండా అతని డ్రైవర్‌తో ఫోన్‌ చేయించి కాన్ఫరెన్స్‌లో వెంకటేశ్‌తో మాట్లాడాడు.

ఎస్సై సూచన మేరకు వెంకటేశ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కల్వకుర్తి పట్టణానికి చెందిన అంబులెన్సు డ్రైవర్‌ విక్రమ్‌కు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం లంచం సొమ్మును సీజ్‌ చేసి, వెంటనే వెల్దండ ఠాణాలోనే ఎస్సై రవిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కృష్ణాగౌడ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.