Amit Shah: పుల్లెల గోపీచంద్ తో భేటీ అయిన కేంద్ర మంత్రి.. ఆ అంశాలపైనే చర్చించిన అమిత్ షా

తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ హీరోలైన ఎన్టీఆర్ తో కేంద్ర మంత్రి..

Amit Shah: పుల్లెల గోపీచంద్ తో భేటీ అయిన కేంద్ర మంత్రి.. ఆ అంశాలపైనే చర్చించిన అమిత్ షా
Pullela Gopichand Meets Amit Shah In Hyderabad
Follow us
Ganesh Mudavath

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 17, 2022 | 2:53 PM

Pullela Gopichand Meets Amit Shah: తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర మంత్రి అమిత్ షా, నితిన్ తో జేపీ నడ్డా భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న అమిత్ షా.. క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన పుల్లెల గోపీచంద్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ లో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన గోపీచంద్..  ఇరువురు మర్యాదపూర్వకంగానే కలిశామని, రాజకీయాల గురించి చర్చించలేదని అన్నారు. కేవలం స్పోర్ట్స్ అండ్ పతకాల గురించే మాట్లాడుకున్నామని చెప్పారు. క్రీడల్లో పురోగతి, అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధానాలపై చర్చకు వచ్చాయి.

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. హైదరాబాద్‌ సహా, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ కృషి లేకపోతే నిజాం నుంచి విముక్తి లభించేందుకు ఇంకా చాలా సమయం పట్టేదన్నారు. నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించడంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు. పటేల్‌ పోరాటంతోనే నిజాం తలవంచారని చెప్పారు. కానీ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని, ఇన్నాళ్లూ ఏ గవర్నమెంట్‌ కూడా ముందుకు రాలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పడం విశేషం.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో పుల్లెల గోపీచంద్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు అమిత్ షా.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..