Hyderabad: అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన కారు.. అందులో TRS నేత.. వెంటనే రంగంలోకి స్పెషల్ బ్రాంచ్

పరేడ్ గ్రౌండ్ సభ తర్వాత హరిత ప్లాజాకు బయల్దేరిన అమిత్‌షా కాన్వాయ్‌కు ఓ కారు అడ్డొచ్చింది. దీంతో 5 నిమిషాల పాటు షా కాన్వాయ్ ఆగిపోయింది.

Hyderabad: అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన కారు.. అందులో TRS నేత.. వెంటనే రంగంలోకి స్పెషల్ బ్రాంచ్
Amit Shah's Security Breach
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 17, 2022 | 12:48 PM

Hyderabad Liberation Day: కేంద్ర హోమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. హరిత ప్లాజా ఎంట్రీ పాయింట్ వద్ద అమిత్ షా కాన్వాయ్‌కి ఓ కారు అడ్డొచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో అమిత్ షా(Amit Shah) భద్రతా సిబ్బంది కారు వెనక అద్దం పగలగొట్టారు. ఈ ఘటనతో దాదాపు 5 నిమిషాలు హరిత ప్లాజా ముందు ఆగిపోయింది అమిత్ షా కాన్వాయ్.  అయితే టెన్షన్‌లో అలా జరిగిపోయింది అని ఆ కారులోని వ్యక్తి చెబుతున్నాడు. కాగా సెక్యూరిటీ బ్రీచ్‌ గురించి తెలిసిన వెంటనే స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చిన కారు వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోమంత్రి కాన్వాయ్‌కి కారు అడ్డుగా రావడంపై స్థానిక ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కారు అడ్డుగా వచ్చింది, ఆ కారులో ఉన్న వ్యక్తి వంటి వివరాలను ట్రాఫిక్ పోలీసుల నుంచి స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిసుకున్నారు. కారులోని వ్యక్తి టీఆర్‌ఎస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్‌గా గుర్తించారు. ప్రజంట్ శ్రీనివాస్ యాదవ్  పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నాడు. కారుని కావాలని ఆపాడా… అనుకోకుండా ఆగిందా అనేదానిపై శ్రీనివాస్ యాదవ్‌ను పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..