Anil kumar poka |
Updated on: Sep 17, 2022 | 11:58 AM
తెలంగాణలో విమోచన దినోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలు శోభాయమానంగా మారాయి. పోలీసుల కవాతులు, వీవీఐపీల రాక, కళాకారుల నృత్యాలతో విమోచన వేడుకలు నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సాగుతున్నాయి.
కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న విమోచన వేడుకలకు కేంద్రం హోంమంత్రి అమిత్ షా(Amit Shah) హాజరయ్యారు.
అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకంలో సంతకం చేసి సందేశాన్ని రాశారు.
అమరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న వేడుకల్లో కళాకారులు నృత్యాలతో అలరిస్తున్నారు.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాలంకరణలో ప్రదర్శనలు ఇచ్చారు. మూడు రాష్ట్రాల కళారూపకాల ప్రదర్శనతో పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలు మార్మోగాయి. డప్పుదరువులు, ఒగ్గు కథలతో కళాకారులు హోరెత్తించారు.
కేంద్రం నేతృత్వంలో కొనసాగుతున్న విమోచన వేడుకలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పర్యవేక్షిస్తున్నారు.
కేంద్రం ఆహ్వానం మేరకు మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పరేడ్ గ్రౌండ్స్ వేడుకలకు హాజరయ్యారు.
గన్‌పార్కు దగ్గర కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా ఫొటోస్..