Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. బర్త్ డే వేడుకల్లో తుపాకీతో..
TRSV మండల ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రమ్‌లు.. గన్‌తో ఫైరింగ్ చేశారు. ఎయిర్ గన్‌తో గాల్లోకి కాల్పులు జరపడమే కాకుండా, ఆ దృశ్యాలను మొబైల్‌లో షూట్‌చేసి వాట్సప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నారు.
Hyderabad gun fire: హైదరాబాద్‌లో మరోసారి తుపాకీ కాల్పుల కలకలం రేపాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున నగర శివార్లలో కాల్పుల సౌండ్స్ భాగ్యనగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ కాల్పులు జరిగాయి. మిర్ఖంపేట్ గెస్ట్ హౌస్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న టీఆర్‌ఎస్‌వీ నాయకులు, ఎయిర్ గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. TRSV మండల ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రమ్‌లు.. గన్‌తో ఫైరింగ్ చేశారు. ఎయిర్ గన్‌తో గాల్లోకి కాల్పులు జరపడమే కాకుండా, ఆ దృశ్యాలను మొబైల్‌లో షూట్‌చేసి వాట్సప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నారు. దాంతో, ఈ కాల్పుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గన్ ఫైరింగ్‌పై ట్రోలింగ్ కూడా మొదలైంది. అసలిది, ఒరిజినల్ గన్‌నేనా? లేక డమ్మీ ఎయిర్ గన్‌నా అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.
మిర్ఖంపేట్‌లోని రవీందర్‌రెడ్డి గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ బర్త్‌డే పార్టీకి TRS బడా నేతలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. పెద్ద నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో ఇలా గాల్లోకి కాల్పులు జరపడం సంచలనం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఫంక్షన్ ఏదైనా గాల్లోకి కాల్పులు జరపడం ఫ్యాషన్ అండ్ స్టేటస్ సింబల్‌గా మారిపోతోంది. మరి, TRSV నాయకుల గన్ ఫైరింగ్‌పై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని పలువురు పేర్కొంటన్నారు. చట్టం అంటే భయం లేకుండా గాల్లోకి కాల్పులు జరపడమే కాకుండా, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాళ్లిద్దరిపై యాక్షన్ ఉంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సిందే.
పోలీసుల తనిఖీలు..
కాగా.. మిర్ఖంపేట్ ఫాంహౌస్ లో యాచారం పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఎయిర్ గన్, పిల్లేట్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 35 మోడల్ ఎయిర్ గన్ గా గుర్తించారు. కర్మన్‌ఘాట్ కు చెందిన రవీందర్ రెడ్త్ ఫాంహౌస్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి