Hyderabad: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం.. ప్రసంగిస్తూనే వ్యక్తి మృతి.. వీడియో..

ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటున్న వేళ, జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి మాట్లాడుతూనే, గుండె పోటుకు గురై హఠాన్మరణం చెందారు. ఈ షాకింగ్‌ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Hyderabad: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం.. ప్రసంగిస్తూనే వ్యక్తి మృతి.. వీడియో..
Hyderabad
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 15, 2022 | 9:41 PM

Independence Day 2022: మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కాసేటి క్రితమే కనిపించిన వారు.. అకస్మాత్తుగా హఠాన్మరణం చెందుతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ హృదయ విదారకమైన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అందరితో అప్పటివరకు కలిసి మెలసి ఉన్న ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటున్న వేళ, జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి మాట్లాడుతూనే, గుండె పోటుకు గురై హఠాన్మరణం చెందారు. ఈ షాకింగ్‌ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

కుషాయిగూడలోని కాప్రా పరిధిలో గల లక్ష్మి విల్లాస్‌లో ఉప్పల సురేష్ అనే వ్యాపారి జెండా వందనంలో పాల్గొన్నారు. అప్పటివరకు అందరితో మాట్లాడుతూ కనిపించారు. జెండా వందనం అనంతరం స్టేజ్‌పై ప్రసంగిస్తుండగా సురేష్‌ హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండె పోటు రావడంతో సురేష్‌ మృతి చెందినట్లు తెలిపారు.

వీడియో..

ఇవి కూడా చదవండి

భాగ్ అంబర్ పేట డిడి కాలనీలో ఉప్పల సురేష్ ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో కాప్రా, లక్ష్మి విల్లాస్‌ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఉప్పల సురేష్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే