Hyderabad: మూసారాంబాగ్ బ్రిడ్జి పై రాకపోకలు బంద్.. ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.. భారీగా నిలిచిన వాహనాలు

హైదరాబాద్ (Hyderabad) లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గురువారం ఉదయం వరకు వంతెనపై వరద వచ్చే అవకాశం ఉండటంతో...

Hyderabad: మూసారాంబాగ్ బ్రిడ్జి పై రాకపోకలు బంద్.. ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.. భారీగా నిలిచిన వాహనాలు
Musarambagh Bridge
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 27, 2022 | 3:26 PM

హైదరాబాద్ (Hyderabad) లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గురువారం ఉదయం వరకు వంతెనపై వరద వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిపేసారు. అంబర్‌పేట – కాచిగూడ, మూసారాంబాగ్ – మలక్‌పేట (Malakpet) మార్గాల్లో ఎవరినీ అనుమతించడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్న ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలతో దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చాదర్‌ఘాట్‌, కోఠి రహదారిపై రద్దీ విపరీతంగా పెరిగింది. కాగా నగరంలోని జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ లను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. వరద ప్రవాహం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరోవైపు.. మూసారాంబాగ్‌ బ్రిడ్జిని అంబర్‌పేట ఎమ్మెల్యే, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ రూ.52 కోట్లను కేటాయించారని, మరో 2 నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీకి వరద అంతకంతకూ పెరుగుతోంది. హుస్సేన్ సాగర్‌కూ వరద పోటెత్తుతోంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా తూముల ద్వారా దిగువకు వదులుతున్నారు. రానున్న రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హుస్సేన్ సాగర్ దిగువన నివాసమంటున్న వారు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉంటున్న వారిని అధికారులు అప్రమత్తం చేశారు. పరిగి, వికారాబాద్‌, చేవెళ్లలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో జంటజలాశయాలకు భారీగా వరద వస్తోంది. గండిపేట డ్యాం 12 గేట్లు, హిమాయత్‌సాగర్ డ్యాం 8 గేట్లు తెరిచారు. ఇప్పటికే మూసీలో ప్రవాహం పెరగగా జంట జలాశయాల నుంచి వస్తోన్న నీటితో మూసీ ప్రవాహం ప్రమాదకరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!