AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి.. ఎంత గాలించినా కనిపించని ఆచూకి… 14 రోజుల తర్వాత

ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. అధికారులు ఎంత గాలింపు జరిపినా ఆచూకి చిక్కలేదు. కుటుంబ సభ్యులు అతను చనిపోయాడని దు:ఖ సాగరంలో మునిగిపోయారు. 14 రోజుల తర్వాత

Viral: వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి.. ఎంత గాలించినా కనిపించని ఆచూకి... 14 రోజుల తర్వాత
Representative image
Ram Naramaneni
|

Updated on: Jul 27, 2022 | 2:34 PM

Share

Trending: ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఎన్నో లక్షలమంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో కొట్టుకుపోయిన కొందరి వ్యక్తుల ఆచూకి కూడా తెలియలేదు. అధికారులు వెతికినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇలానే ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఓ కాలువలో కొట్టుకుపోయి.. చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా కనిపించిన ఘటన కర్ణాటక(Karnataka)లోని చిక్కమంగళూరు(Chikkamagaluru)లో జరిగింది. ఈ నెల 12న కాలువ దాటేందుకు ప్రయత్నిస్తూ భారీ వరదప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు పట్టణానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి. అనూహ్యంగా ఈ మంగళవారం.. అంటే 14 రోజుల తర్వాత చిక్కమంగళూరులోని ఓ వీధిలో కనిపించాడు. అతడిని చూసిన ఓ తెలిసిన వ్యక్తి స్టన్ అయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశాడు. అధికారులు కూడా అతడి వద్దకు చేరకుని వివరాలు సేకరించారు. అదృష్టవశాత్తూ తాను ప్రాణాలు నిలుపుకున్నట్లు సురేష్ తెలిపాడు. తమకు సమాచారం ఇవ్వకపోవడంతో అధికారులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లేడు.. ఇక రాడు అనుకున్న మనిషి తిరిగి రావడంతో.. కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు.

Man In Floods

వరద నీటిలో కొట్టుకుపోయి తిరిగివచ్చిన వ్యక్తి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..