AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వైజాగ్‌ వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్‌.. సాయి ప్రియ ఏం చేసిందో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..

Andhra Pradesh: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పి పోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతోన్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి..

Andhra Pradesh: వైజాగ్‌ వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్‌.. సాయి ప్రియ ఏం చేసిందో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..
Sai Priya
Narender Vaitla
|

Updated on: Jul 27, 2022 | 1:02 PM

Share

Andhra Pradesh: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పి పోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతోన్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమిడికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్‌ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.

శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్‌లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్‌ డే అని శ్రీనివాస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్‌ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్‌ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

గాలింపు కోసం రూ. కోటి ఖర్చు..

ఇదిలా ఉంటే సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ. కోటి ఖర్చు చేసింది. ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్