Hyderabad ED Raids: హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు.. ఎందుకంటే..!
Hyderabad ED Raids: హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌కు చెందిన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లు, ఆఫీస్‌లపై ఈడీ అధికారులు..
Hyderabad ED Raids: హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌కు చెందిన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లు, ఆఫీస్‌లపై ఈడీ అధికారులు దాడులు చేసింది. వీరిద్దరితో పాటు ఏజెంట్ల ఇళ్లపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తోపాటు గుంటూరు, వైజాగ్‌కు చెందిన కొందరిని క్యాసినో గేమ్ ఆడేందుకు నేపాల్‌తో పాటు సరిహద్దుకు తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ గేమ్ ఆడేందుకు ఒక్కొక్కరి దగ్గర సుమారు మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు నగరంలోని బోయిన్‌పల్లిలో ఉంటున్న వారి నివాసాలపై దాడులు నిర్వహించింది.
అయితే మాధవ్‌రెడ్డి, ప్రవీణ్‌లు గత కొన్ని నెలల క్రితం కొందరి వ్యక్తులను శ్రీలంకకు తీసుకెళ్లి అక్కడ క్యాసినో ఆడించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. దీంతో వారు అక్కడికి మకాం మార్చినట్లు సమాచారం. అంతేకాకుండా దీనిని ఆడేవారి కోసం అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఈడీ విచారణలో తేలింది. శ్రీలంకకు చెందిన కొన్ని క్యాసినో కంపెనీలీతో వీరు ఒప్పందం కుదుర్చుకుని క్యాసినో గేమ్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..