Hyderabad: దొంగగా మారిన ఎంబీఏ డ్యాన్స్ మాస్టర్..! అలవాటు లేని పనికావడంతో సులువుగా పోలీసులకు చిక్కాడు..

Hyderabad: అలావాటు లేని పనిచేస్తే ఎవరైనా ఇట్టే దొరికేస్తారు. ఎంబీఏ చదివి ఉద్యోగం లేక చిన్నపిల్లలకు డ్యాన్స్ నేర్పించే ఓ యువకుడు దొంగగా మారాడు.

Hyderabad: దొంగగా మారిన ఎంబీఏ డ్యాన్స్ మాస్టర్..! అలవాటు లేని పనికావడంతో సులువుగా పోలీసులకు చిక్కాడు..
Thief Arrested
Follow us
uppula Raju

|

Updated on: Aug 22, 2021 | 6:16 AM

Hyderabad: అలావాటు లేని పనిచేస్తే ఎవరైనా ఇట్టే దొరికేస్తారు. ఎంబీఏ చదివి ఉద్యోగం లేక చిన్నపిల్లలకు డ్యాన్స్ నేర్పించే ఓ యువకుడు దొంగగా మారాడు. కరోనా కారణంగా ఉపాధి లేక తప్పుదారిపట్టాడు. యువతి మెడలో చైన్ దొంగలించి 24 గంటల్లోనే పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన చింత వినోద్‌ పెద్దపల్లికి చెందిన డి. సుచరిత అనే యువతి మెడలో నుంచి చైన్ దొంగిలించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సుచరిత మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె మధురా నగర్‌ కాలనీలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. గురువారం ఆమె రోజు మాదిరిగానే ఆఫీస్‌కు బయలుదేరింది. మధురానగర్‌ మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురు చూడసాగింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన వినోద్‌.. సుచరిత మెడలోని రూ. 45 వేలు విలువ చేసే బంగారం గొలుసును దొంగిలించాడు. దీంతో బాధితురాలు జరిగిన ఘటనపై ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే వినోద్‌ని అరెస్ట్ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేకనే గొలుసు చోరీకి పాల్పడ్డానని, చోరికి పాల్పడటం ఇదే తొలిసారని వినోద్‌ పోలీసులకు చెప్పడం విశేషం. కాగా నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కి తరలించారు.

Vijayawada: విజయవాడలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సింధు అనుమానాస్పద మృతి.. ఆ గాయాలు ఎందుకయ్యాయి..?

Social Media Harassment: విజయవాడలో దారుణం.. యువతి నగ్న చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఇద్దరు ఉన్నాదులు.

Viral Video: ఆ ఇంట్లో కనిపించని శక్తి.. వరుసగా మూడు ఇళ్లలో మంటలు.. జనాలంతా అవాక్కు.. వీడియో

Varla vs Jogi: జోగి రమేష్ ప్రకటన భారత రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే కాదు.. అంబేద్కర్‌పై దాడి కూడా : వర్ల