AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varla vs Jogi: జోగి రమేష్ ప్రకటన భారత రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే కాదు.. అంబేద్కర్‌పై దాడి కూడా : వర్ల

వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు

Varla vs Jogi: జోగి రమేష్  ప్రకటన భారత రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే కాదు.. అంబేద్కర్‌పై దాడి కూడా : వర్ల
Venkata Narayana
|

Updated on: Aug 21, 2021 | 8:14 PM

Share

Varla Ramaiah – Jogi Ramesh: వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య. “మన పూర్వీకుల అనేక త్యాగాల ఫలితంగా భారత రాజ్యాంగం ఒక అత్యున్నత డాక్యుమెంట్‌గా రూపొందిన సంగతి మీకు తెలుసు. పౌరులందరికీ సమాన హక్కులు కల్పించడంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారు. సాంప్రదాయ హెచ్చుతగ్గులు, అసమానతలు ఉన్నప్పటికీ, భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హోదా, హక్కులు కల్పించింది. సమాజంలోని అణగారిన వర్గాలకు సమానత్వం కల్పించేందుకు రాజ్యాంగంలో నిశ్చయాత్మక చర్యలను పొందుపరిచారు. కానీ, హక్కులు మరియు సమానత్వం కల్పించిన రాజ్యాంగం పై నేడు మన సమాజంలోని కొన్ని విభజన శక్తులు దాడి చేస్తున్నాయి.” అని వర్ల తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

“బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల కోసం మాత్రమే వ్రాసారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఒక వీడియోలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటన భారత రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే కాకుండా డా. అంబేద్కర్‌పై దాడి చేయడం కూడా. అంతే కాకుండా, ఈ వ్యాఖ్య ప్రత్యేకంగా షెడ్యూల్ కులాలను కించపరచడం, అవమానించడం తప్ప మరొకటి కాదు. వర్గ విద్వేషాన్ని రెచ్చగొట్టే ఇలాంటి ప్రకటన చట్టంలోని నిర్దిష్ట సెక్షన్ల కింద శిక్షార్హమైనది. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికీ సంబంధించినది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలు దేశంలో మరి ఎక్కడా వినబడవు. కాబట్టి చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం వెంటనే కేసు నమోదు చేసి జోగి రమేష్‌పై చర్యలు వెంటనే ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతున్నాను.” అని వర్ల డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read also: Sridevi Soda Center: ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదిరిపోతోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సేల్స్.!