Vijayawada: విజయవాడలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సింధు అనుమానాస్పద మృతి.. ఆ గాయాలు ఎందుకయ్యాయి..?

Vijayawada: విజయవాడలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సింధు అనుమానాస్పద మృతి.. ఆ గాయాలు ఎందుకయ్యాయి..?
Girl Death

విజయవాడ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఓ ఇంట్లో.. చార్టెడ్ అకౌంటెంట్‌ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు...

Ram Naramaneni

|

Aug 21, 2021 | 9:41 PM

విజయవాడ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఓ ఇంట్లో.. చార్టెడ్ అకౌంటెంట్‌ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తలకు బలమైన గాయం ఉండటం గుర్తించిన మాచవరం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సింధుది హ‌త్యే అని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సింధు స‌న్నిహితుడు ప్రసేన్‌ హ‌త్య చేశాడని అంటున్నారు. కొద్దిరోజులుగా ప్రసేన్‌తో సన్నిహితంగా ఉంటున్న సింధు.. లాక్‌డౌన్ అనంత‌రం అతని ఇంట్లోనే ఉంటోందని కంప్లైంటులో పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని యువతి తల్లిదండ్రులు ఎంపీ కేశినేని నానిని కోరారు. పోలీసు కమిషనర్‌ను కలిసి ఈమేరకు ఫిర్యాదు చేయనున్నట్టు సింధు తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమని సమాచారం. అయితే సింధు, ప్రసేన్‌ల ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని తెలుస్తోంది.

నల్గొండలో యువకుడి దారుణ హత్య

నల్గొండ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కత్తులతో యువకుడిని దారుణంగా పొడిచారు దుండగుడు. తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే  యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ  పట్టణంలోని పాత బస్తీకి చెందిన షోయబ్ పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇదే బస్తీకి చెందిన జాని రషీద్ అనే రౌడీ షీటర్ స్నేహితులుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో జాని రషీద్ తో షోయబ్ దూరంగా ఉంటున్నాడు. దీనితో షోయబ్ పై రషీద్ కక్ష పెంచుున్నాడు. సాయంత్రం పాన్ షాప్ వద్ద ఉన్న షోయబ్ పై కత్తితో జానీ రషీద్ దాడి చేశాడు. తీవ్రంగా గాయ పడిన షోయబ్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. షోయబ్ తండ్రి ఫాయాజ్ అహ్మద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో మొహరం వేడుకలు జరుగుతున్న సమయంలో హత్య జరగడంతో పోలీసులు అప్రమత్త మయ్యారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

విజయవాడలో యువతి నగ్న చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఇద్దరు ఉన్నాదులు

సోషల్‌ మీడియాలో మహిళలపై వేధింపులు ఇటీవలి కాలంలో ఎక్కువుతున్నాయి. తాము చెప్పినట్లు వినకపోయినా, తమ మాటకు ఎదురు చెప్పినా సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు మహిళలను మానసికంగా హింసిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి విజయవాడలో వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన రోహిత్‌ కుమార్‌ అనే యువకుడు విజయవాడలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే స్నేహం పేరుతో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలోనే యువతితో సాన్నిహిత్యం పెంచుకున్న ఆ ప్రబుద్ధుడు ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలను సేకరించాడు.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రోహిత్‌ తీరు నచ్చని యువతి అతనిని దూరం పెడుతూ వచ్చింది. దీంతో పగ పెంచుకున్న రోహిత్‌, కృష్ణ లంకకు చెందిన దండగుల గణేష్‌తో కలిసి యువతిని వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే సదరు యువతి పేరుతో ఓ నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను రూపొందించాడు. అనంతరం ఆ అకౌంట్‌లో యువతికి చెందిన నగ్న ఫొటోలను పోస్ట్‌ చేయడం ప్రారంభించారు. దీంతో విషయం తెలుసుకున్న యువతి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరిని విచారిస్తున్నారు.

Also Read:  అఫ్గానిస్థాన్‌లో ఆంధ్రుల కోసం.. విజ‌య‌వాడ‌లో స్పెషల్ హెల్ప్ డెస్క్.. నంబర్లు ఇవే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu