Afghanistan Crisis: అఫ్గానిస్థాన్‌లో ఆంధ్రుల కోసం.. విజ‌య‌వాడ‌లో స్పెషల్ హెల్ప్ డెస్క్.. నంబర్లు ఇవే

అఫ్గానిస్థాన్​లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.

Afghanistan Crisis: అఫ్గానిస్థాన్‌లో ఆంధ్రుల కోసం.. విజ‌య‌వాడ‌లో స్పెషల్ హెల్ప్ డెస్క్.. నంబర్లు ఇవే
andhra pradesh government
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 21, 2021 | 9:13 PM

అఫ్గానిస్థాన్​లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. ఏపీ కార్మికులను సేఫ్‌గా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసినట్టుగా ఆ శాఖ కమిషనర్ రేఖారాణి తెలిపారు. అఫ్గానిస్థాన్ లో ఉన్న కార్మికులు, వారికి సంబంధించిన వివరాలను 0866-2436314 కు లేదా 917780339884 నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.

వీటికి అదనంగా.. మరో రెండు నెంబర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. +919492555089, 8977925653 నెంబర్లకు కూడా అఫ్గాన్ కార్మికులకు సంబంధించిన వివరాలను తెలియచేయవచ్చని వెల్లడించింది. అఫ్గాన్ లో చిక్కుకున్నవారిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెనక్కు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించినట్టు కార్మిక శాఖ వెల్లడించింది.

మనవాళ్లను తీసుకొచ్చేందుకు ముమ్మర చర్యలు

తాలిబన్ మూకలు చుట్టుముట్టారు. పిల్లలను ఎత్తుకెళ్లిన రాబందుల్లా.. అక్కడ ఉన్న మనవాళ్లను తీసుకెళ్లారు. 150మందికి పైగా పౌరులను కిడ్నాప్‌ చేశారు. అప్పటి వరకూ వారి కళ్లల్లో ఉన్న ఆనందం ఆవిరై పోయింది. తాలిబన్ మూకలు ఏం చేస్తాయో అనే గుబులు.. వారి గుండెలను కమ్మేసింది. బరువెక్కిన హృదయంతో.. ఆర్తనాదాలు చేశారు. కానీ పట్టించుకున్న వారే లేరు.ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలీదు. ఎందుకు లాక్కెళ్తున్నారో తెలీదు. ఈ వార్త విన్న యావత్ భారతం ఆందోళన చెందింది. చెడ బుట్టిన తాలిబన్లు.. ఏం చేస్తారో అన్న భయం వెంటాడింది.  కానీ కొద్ది సేపటికి సేఫ్‌గా మన వాళ్లను వదిలేశారు. ఏదో ఫార్మాలిటీ చెకప్ కోసమే.. తీసుకెళ్లాం అంటూ కపట ప్రకటన చేశారు.  తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులను విడిచిపెట్టినట్టు విదేశాంగశాఖ కూడా ప్రకటించింది. ఆఫ్ఘన్‌ సిక్కులతో పాటు భారత పౌరులను కిడ్నాప్‌ చేసిన తాలిబన్లు తరువాత విడిచిపెట్టారు. తాము ఎవరిని బంధించలేదని , కొంతమందిని విచారించిన తరువాత వదిలేసినట్టు తాలిబన్లు ప్రకటించారు. విడిచిపెట్టిన భారత పౌరులంతా ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వచ్చారు. స్వదేశానికి వాళ్లను తరలిస్తునట్టు కేంద్రం తెలిపింది.

మరోవైపు కాబుల్‌ విమానాశ్రయానికి వేలమంది పోటెత్తుతున్నారు. తాలిబన్ల రాక్షస పాలనను తలుచుకొని ఎయిర్‌పోర్టులకు తరలివస్తున్నారు. ఐతే నగరవ్యాప్తంగా చెక్‌పాయింట్లు పెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు తాలిబన్లు. ఆప్ఘన్‌లు విమానాశ్రయానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దొరికినవారిని చితకబాది మరీ వెనక్కి పంపుతున్నారు. ఎలాగోలా ముష్కరుల కళ్లుగప్పి, అతికష్టమ్మీద జనం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. కానీ అక్కడ కూడా వారిని విమానాలు ఎక్కనీయకుండా అడ్డుకొని..తమ ప్రతాపం చూపిస్తోంది ముష్కర మూక.

ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలను కోరుకుంటున్నామని పైకి చెప్తున్న తాలిబన్లు.. వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కాందహార్‌, హెరాత్‌లలోని భారత కాన్సులేట్‌ల్లోకి చొరబడ్డారు. తనిఖీలు నిర్వహించారు. అనంతరం కార్యాలయాల ముందు నిలిపి ఉంచిన కార్లను తీసుకెళ్లారు. ఐతే కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయంలో మాత్రం తనిఖీలేవీ జరగలేదని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు. కాబుల్‌లో రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయొద్దని, అక్కడి సిబ్బంది భద్రతకు తాము భరోసా ఇస్తామని కతార్‌లోని తాలిబన్‌ కార్యాలయం నుంచి భారత్‌కు సందేశం వచ్చినట్లు తెలుస్తోంది.

తాలిబన్లు ఆప్ఘన్‌ను ఆక్రమించినా.. వారి అధినేత హైబతుల్లా అఖుంద్‌జాదా ఇప్పటికీ బహిరంగంగా కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఎక్కడున్నారన్నదీ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ నిఘా సంస్థలు అందించిన సమాచారాన్ని విశ్లేషించిన భారత వర్గాలు.. అఖుంద్‌జాదా ప్రస్తుతం పాకిస్థాన్‌ సైన్యం రక్షణలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. అమెరికా డ్రోన్‌ దాడుల్లో అఖ్తర్‌ మన్సూర్‌ హతమయ్యాక.. ఆయన స్థానంలో తాలిబన్ల సుప్రీం లీడర్‌గా 2016 మేలో అఖుంద్‌జాదా నియమితులయ్యారు. ఆరు నెలలుగా తాలిబన్‌ నేతలకు కూడా ఆయన కనిపించలేదు.

ఇక అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ఈ నెల 31తో ముగియనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు తాలిబన్లు. ఇందులో భాగంగా కాబూల్‌కు చేరుకున్నాడు తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు అబ్ధుల్‌ ఘనీ బరాదర్‌. తాలిబన్‌ గ్రూప్‌ సభ్యులు, ఇతర రాజకీయ నాయకులతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరపనున్నారు.

ఐతే ఆఫ్ఘన్‌ బలగాల ఉపసంహరణ పూర్తయ్యే వరకు కీలక చర్యలేవీ చేపట్టకుండా అమెరికాకు, తాలిబన్లకు మధ్య ఒప్పందం ఉందని తెలిపారు అఫ్గాన్‌ అధికారి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు, కీలక నిర్ణయాల ప్రకటన వంటి చర్యలకు ముష్కర ముఠా ఈ నెలాఖరు వరకు దూరంగా ఉండే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Also Read:కృష్ణా జిల్లాలో దంచికొట్టిన వర్షం.. మరో 3 రోజులు సేమ్ సీన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్

వలలో అరుదైన కచిడి చేపలు చిక్కాయి.. మత్సకారులకి సిరులు కురిపించాయి.. విలువంతా వాటి పొట్ట వల్లే

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!