కృష్ణా జిల్లాలో దంచికొట్టిన వర్షం.. మరో 3 రోజులు సేమ్ సీన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్

కృష్ణా జిల్లాలో దంచికొట్టిన వర్షం.. మరో 3 రోజులు సేమ్ సీన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్
Krishna District Rains

విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా 3 గంటలపాటు కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై...

Ram Naramaneni

|

Aug 21, 2021 | 8:46 PM

విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా 3 గంటలపాటు కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుప్రధాన రహదారులు చెరువులని తలపించాయి. కృష్ణాజిల్లాతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, పెనమలూరు ప్రాంతాల్లో వర్షం పడింది. అటు గుంటూరు నగరంలోనూ ఎడతెరిపి లేని వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. ఎంజీ రోడ్, ఏలూరు రోడ్, లబ్బీ పేట, మొగల్రాజపురం, రెవెన్యూ కాలనీ, కృష్ణలంక, రాణిగారితోట, సింగ్ నగర్, తదితర ప్రాంతాలలోని‌ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రెవెన్యూ కాలనీలోని రోడ్లు ఈ భారీవర్షానికి పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలోని సెల్లార్‌లోకి వర్షపు నీరు చేరిపోయి వాహనాలు సైతం మునిగిపోయాయి.

కీలక సూచనలు చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్

రాబోయే మూడు రోజుల పాటు కృష్ణా జిల్లా తీరప్రాంత మండలాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ కోరారు. ఆగష్టు 21 వ తేదీ నుంచి ఆగస్టు 24 వ తేదీ వరకు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు జిల్లావ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ శనివారం సాయంత్రం ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంతంలోనిఅన్ని మండలాల్లోని తహశీల్దార్‌లు అందరూ ఆయా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని , అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ఈనెల 24 వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించరాదని సముద్ర తీరప్రాంత తహశీల్దార్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గ్రామాల్లో పరిస్థితిని గమనించడానికి గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ స్థాయి కార్యదర్శులందరూ తమ గ్రామాలలోనే ఉండాలని ఆదేశించారు. అవసరమైతే గుర్తించిన కేంద్రంలో పునరావాసం కల్పించాలన్నారు. లోతట్టు ప్రదేశాలలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి వారిని తరలించడానికి తగిన ఫంక్షన్ హాల్/పాఠశాలలు మొదలైనవి గుర్తించాలన్నారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున లంక గ్రామాలను కలిగి ఉన్న తహశీల్దార్‌లు మత్స్య శాఖ ,అగ్నిమాపక శాఖతో సంప్రదింపులు జరిపి పడవలు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Also Read: వలలో అరుదైన కచిడి చేపలు చిక్కాయి.. మత్సకారులకి సిరులు కురిపించాయి.. విలువంతా వాటి పొట్ట వల్లే

Telangana: పగలు సర్పంచ్.. రాత్రి సెక్యూరిటీ గార్డ్.. పాపం ఇరుసు మల్లేష్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu