వలలో అరుదైన కచిడి చేపలు చిక్కాయి.. మత్సకారులకి సిరులు కురిపించాయి.. విలువంతా వాటి పొట్ట వల్లే

వలలో అరుదైన కచిడి చేపలు చిక్కాయి.. మత్సకారులకి సిరులు కురిపించాయి.. విలువంతా వాటి పొట్ట వల్లే
Kachidi Fish

Kachidi Fish: వల వేసిన ప్రతిసారీ మత్యకారుడు కోటి ఆశలతో ఉంటాడు. అరుదైన చేపలు వలలో చిక్కాలని.. ఈ దెబ్బతో తన ఫేట్ మారాలని ఆరాటపడతాడు. కానీ..

Ram Naramaneni

|

Aug 21, 2021 | 8:02 PM

వల వేసిన ప్రతిసారీ మత్యకారుడు కోటి ఆశలతో ఉంటాడు. అరుదైన చేపలు వలలో చిక్కాలని.. ఈ దెబ్బతో తన ఫేట్ మారాలని ఆరాటపడతాడు. కానీ అలా జరగడం చాలా అరుదు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కృష్ణా జిల్లా జాలర్లు వేసిన వలలో అరుదైన కచిడి చేపలు చిక్కాయి. రెండు కచిడి చేపలు చిక్కగా.. అందులో ఒకటి మగది.. మరొకటి ఆడది.  అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్‌లో ఈ కచిడి చేపలు స్థానికులను అబ్బురపరిచాయి. మగ చేప 16 కిలోల బరువు తూగింది. ఆడచేప 15 కేజీలు ఉంది. వీటిని కొనేందుకు వ్యాపారలు ఎగబడ్డారు. స్థానిక మార్కెట్ లో విక్రయించగా మగ చేప లక్ష రూపాయలకు, ఆడచేప 30 వేలుకు అమ్ముడు పోయాయి. ఈ చేపల పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషద గుణాలుంటాయని, అందులోనూ మగ చేపలో ఎక్కువగా ఔషధాలు ఉంటాయని అందువలనే ఈ చేపలకు ఇంత గిరాకీ ఉంటుందని మత్స్యశాఖ ఏడి కృష్ణారావు తెలిపారు. ఇలాంటి చేపలు అరుదుగా మత్సకారుల వలలో పడతాయని, అలాంటప్పుడు వారి పంట పండినట్టే అని చెబుతున్నారు.

కచిడి చేప గురించి మరిన్ని విషయాలు…

కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. ఆ చేప పేరులో ఉన్నట్లుగా నిజంగానే అది బంగారంలానే విలువ కలిగి ఉంటుంది. మత్స్యకారుల పంట పండిస్తుంది. కచిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అలా ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు తిరుగుతుంది. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతాయి. కచిడి చేప శాస్త్రీయ నామం..ప్రొటోనిబియా డయాకాన్తస్. సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుంది. అంతేకాదు కాస్ట్లీ వైన్‌ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారట. ఈ చేప రెక్కలు వైన్‌ను క్లీన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

Also Read:Telangana: పగలు సర్పంచ్.. రాత్రి సెక్యూరిటీ గార్డ్.. పాపం ఇరుసు మల్లేష్

పరిటాల సిద్ధార్థ్ వద్ద బుల్లెట్ కలకలం.. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని పోలీసుల డెడ్‌లైన్‌..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu