ఎత్తుకెళ్లి నరకడమే.. యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్‌కి వైస్ ఛాన్సలర్ అన్న కొడుకు వార్నింగ్.! వైరల్ అవుతోన్న ఆడియో

'ఎత్తుకెళ్లి నరకడమే.. ఇక జైలుకెళ్లి మరో ఐదు రోజుల్లో బెయిల్‌పై తిరిగొస్తా.. అంతే..!" యస్‌...రాయలసీమ యూనివర్శిటీలో ఓ స్టూడెంట్‌

ఎత్తుకెళ్లి నరకడమే.. యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్‌కి వైస్ ఛాన్సలర్ అన్న కొడుకు వార్నింగ్.!  వైరల్ అవుతోన్న ఆడియో
Rayalaseema University
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 21, 2021 | 7:51 PM

Rayalaseema University: ‘ఎత్తుకెళ్లి నరకడమే.. ఇక జైలుకెళ్లి మరో ఐదు రోజుల్లో బెయిల్‌పై తిరిగొస్తా.. అంతే..!” యస్‌…రాయలసీమ యూనివర్శిటీలో ఓ స్టూడెంట్‌ లీడర్‌కి సాక్షాత్తూ వైస్ ఛాన్సలర్(వీసీ) అన్నయ్య కుమారుడు ఇచ్చిన స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇది. ఈ ఆడియో సోషల్‌ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. స్టూడెంట్‌ లీడర్‌ని చంపుతానంటూ బెదిరించిన ఆడియోపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు రాయలసీమ వర్శిటీ విద్యార్థి సంఘం నేత శ్రీరాములు. వీసీ ఆనంద్‌రావు అన్నయ్య కుమారుడు రాజీవ్‌కుమార్‌ బెదిరించడంతో ఈ వివాదం పోలీసుస్టేషన్‌ దాకా వెళ్లింది.

రాయలసీమ యూనివర్శిటీలో ఆందోళనలు, ధర్నాలతో ఇబ్బందులు పెడితే చంపేస్తానని వీసీ అన్న కొడుకు రాజీవ్‌కుమార్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ ఆడియో సంచలనంగా మారింది. రాజీవ్‌కుమార్‌ తోపాటు వీసీ ఆనంద్‌రావుపై కేసు నమోదు చేయాలని శ్రీరాములు డిమాండ్‌ చేశారు. యూనివర్శిటీలో అవినీతి జరిగింది చర్యలు తీసుకోవాలని కోరితే…వీసీ ఆనంద్‌రావు కక్ష కట్టారని శ్రీరాములు ఆరోపిస్తున్నారు.

రాయలసీమ వర్శిటీ విద్యార్థిసంఘం నేత శ్రీరాములును చంపేస్తామని వీసీ ఆనంద్‌రావు అన్నయ్య కుమారుడు రాజీవ్‌కుమార్‌ బెదిరించిన ఆడియో ఇప్పుడు యూనివర్శిటీ విద్యా్ర్థుల్లోనే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతోంది. యూనివర్శిటీలో ఆందోళనలు, ధర్నాల ద్వారా ఇబ్బందులు చెబితే, ఏకంగా చంపేస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కాగా, విద్యార్థి సంఘం నేత శ్రీరాములు చేసిన ఆరోపణలను రాయలసీమ వర్శిటీ వీసీ ఆనంద్‌రావు ఖండించారు. తాము ఎవ్వరినీ చంపుతామని బెదిరించలేదని ఆయన స్పష్టం చేశారు. అతను తమ స్టూడెంట్‌ కూడా కాదన్నారు. చదువు అయిపోయిన తర్వాత కూడా యూనివర్శిటీ హాస్టల్లో ఉంటూ కొందరు సమస్యలు సృష్టిస్తున్నారని వీసీ చెప్పారు. అలాంటి వారిని పోలీసుల సహాయంతో బయటకు పంపిస్తున్నామని..అందుకే సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ మొత్తానికి ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read also: Sridevi Soda Center: ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదిరిపోతోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సేల్స్.!