Avanthi Srinivas: సోదరి ద్వారా మనసా, వాచా, కర్మణా, పవిత్రంగా, సత్సంగ జీవిత రూపకల్పనే రాఖీ పండుగ ప్రత్యేకత: మంత్రి అవంతి
తోబుట్టువులందరూ ఎంతో ఆనందం, సంతోషాలతో జరుపుకునే పవిత్రమైన పండుగ రక్షాబంధన్ అని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.
Rakhi Festival – AP minister Avanthi Srinivas: తోబుట్టువులందరూ ఎంతో ఆనందం, సంతోషాలతో జరుపుకునే పవిత్రమైన పండుగ రక్షాబంధన్ అని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాఖీ పండుగ కుల, మత, వర్గ, లింగ బేధాలకు అతీతంగా జరుపుకునే పవిత్రమైన పండుగ అని ఆయన పేర్కొన్నారు. శ్రావణ పౌర్ణమి సంధర్భంగా భారతీయులంతా ఎంతో ఆనందంతో జరుపుకునేదే రాఖీ పండుగ అని మంత్రి చెప్పారు.
రక్షా బంధన్ పర్వదినం సంధర్భంగా విశాఖపట్నం సీతమ్మధారలోని ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి చెందిన బ్రహ్మకుమారీలు మంత్రి అవంతికి ఇవాళ రాఖీ కట్టారు. ఈ సందర్బంగా బ్రహ్మకుమారీస్ కు మంత్రి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మన భారతాన్ని స్వర్గ సీమగా, సువర్ణ భారతంగా మార్చేందుకు స్వచ్ఛమైన మనసుతో ప్రతిఒక్కరూ కట్టేదే ఈ రాఖీ పండుగ అన్నారు. సోదరి ద్వారా మనసా, వాచా, కర్మణా, పవిత్రంగా, సత్సంగ జీవితాన్ని తయారు చేసుకోవడమే ఈ పండుగ ప్రత్యేకత’ అని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు.
Read also: Tulsi Leaves: తులసి మొక్క ఇంట్లో ఉంటే దోషాలు దరిచేరవట.. ఆకులు పరగడుపున ఏ రూపంలో తీసుకున్నా ఎంతో మేలు