Tulsi Leaves: తులసి మొక్క ఇంట్లో ఉంటే దోషాలు దరిచేరవట.. ఆకులు పరగడుపున ఏ రూపంలో తీసుకున్నా ఎంతో మేలు
Health Benefits of Tulsi Leaves: తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు.. పరగడుపున ఏ రూపంలో తీసుకున్నా మేలే..
Updated on: Aug 21, 2021 | 8:52 PM

తులసి ఆకులను ప్రతిరోజూ తీసుకుంటే.. జలుబు, గొంతునొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలు తగ్గుముఖం పడతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తులసి ఆకుల వల్ల కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

తులసి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తులసి, తేనెలో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి.

నోటిపూత సమస్య ఉంటే ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను నమిలి మింగితే.. తగ్గుతుంది. రోజూ తులసి ఆకులను తింటే.. శరీరంలో కొవ్వును సైతం తగ్గించుకోవచ్చు. దీంతోపాటు శరీరంలో మలినాలు బయటకు వెళ్లి బరువు కూడా తగ్గుతారు.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ తులసి ఆకులను తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకులు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడటంతోపాటు.. ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి.



