Hyderabad: ఇంటి చుట్టూ టెంట్లు, 3 రోజులైనా కనబడని బంధువులు.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు మించిన ట్విస్ట్‌

తన ఇంటిని ఆనుకునే.. రాజుల కాలం నాటి కోట బురుజు ఉంది. ఇంటి సమీపంలో పురాతన ఆలయాలు ఉన్నాయి. తాను ఉండే ఏరియా కి కూడా చారిత్రక నేపథ్యం ఉంది..! ఇన్ని ఉన్నాయంటే.. గుప్త నిధులు కూడా ఉండనే ఉంటాయి అనే ఆలోచన అతడిలో మెదిలింది. గుప్త నిధులను అన్వేషించే మెషీన్ తెచ్చి టెస్ట్..

Hyderabad: ఇంటి చుట్టూ టెంట్లు, 3 రోజులైనా కనబడని బంధువులు.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు మించిన ట్విస్ట్‌
Guptha Nidhula Thavvakalu
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2023 | 2:13 PM

తన ఇంటిని ఆనుకునే.. రాజుల కాలం నాటి కోట బురుజు ఉంది. ఇంటి సమీపంలో పురాతన ఆలయాలు ఉన్నాయి. తాను ఉండే ఏరియా కి కూడా చారిత్రక నేపథ్యం ఉంది..! ఇన్ని ఉన్నాయంటే.. గుప్త నిధులు కూడా ఉండనే ఉంటాయి అనే ఆలోచన అతడిలో మెదిలింది. గుప్త నిధులను అన్వేషించే మెషీన్ తెచ్చి టెస్ట్ చేశాడు.. ఇంట్లో నిధులు ఉన్నాయని మెషీన్ కూడా సిగ్నల్ ఇచ్చింది. ఇంకేముంది.. స్నేహితులతో కలిసి ఇంట్లో తవ్వకాలు మొదలు పెట్టాడు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా.. ఇంట్లో షామియానా వేశాడు…సైడ్ వాల్స్ కట్టాడు… రాత్రుల్లో మాత్రమే తవ్వకాలు జరిపాడు. అలా మూడు రోజులు గడిచింది. తర్వాత ఏమైంది…? ఎన్ని లంకె బిందెలు దొరికాయి..? బంగారు, వెండి నాణాలు బయట పడ్డాయా..?

ఇల్లు మొత్తాన్ని కవర్ చేసేలా షామియానా… సైడ్ వాల్స్…!! ఈ ఇంట్లో ఎదో ఫంక్షన్ జరుగుతోంది అనుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా. వాళ్ళ ఇంట్లో ఎదో కార్యక్రమం ఉండొచ్చని అనుకున్నారు. కానీ.. మూడు రోజులవుతున్నా.. చుట్టాలు లేరు.. ఏ సందడీ లేదు.. ! వంటల జాడ అసలే లేదు..! అసలేం జరుగుతోంది అని తొంగి చూసే ప్రయత్నం చేశారు చుట్టుపక్కల వాళ్ళు. చిన్న గ్యాప్ కూడా లేకుండా సైడ్ వాల్స్ తో కవర్ చేశారు. లోపల ఏం జరుగుతోందో బయటకు పొక్కకుండా ఇంటిని కప్పేసారు. దీంతో అనుమానం వచ్చింది. లోపల గుట్టుగా ఎదో జరుగుతోందని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానికుల ఫిర్యాదు తో ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు.. లోపలికి వెళ్ళగానే దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది. లోపల ఎక్కడ చూసినా అడుగడుగునా లోతైన గోతులు తవ్వారు. ఏవో నిర్మాణాల కోసం తవ్విన గోతుల్లా లేవే అని పరిశీలిస్తే … పోలీసులు, స్థానికుల అనుమానమే నిజమైంది. అక్కడ జరుపుతున్న తవ్వకాలు గుప్త నిధుల కోసమే అని తేలింది. నగరం నడిబొడ్డున.. అది కూడా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో.. చుట్టూ నివాస గృహాలు.. అయినా ఏమాత్రం అనుమానం రాకుండా మూడు రోజులుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు ఈ నిందితులు. కనకపు లక్కె బిందెలు దొరికి కోటీశ్వరులు అవుదామనుకున్న వాళ్లు.. ఇప్పుడు కటకటాల పాలయ్యారు.

ఇవి కూడా చదవండి

రాజేంద్రనగర్ పరిధిలోని బుధ్వెల్‌లో ఉందా ఇల్లు. నాగులు అనే వ్యక్తి కి చెందిన ఈ ఇల్లు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించింది. ఇల్లు బాగా పాతబడటంతో.. ఇంటి ముందే మరో స్థలం కొనుక్కుని మూడంతస్తుల ఇల్లు కట్టుకున్నాడు నాగులు. కొత్త ఇంటికి మారిన నాగులు ఫ్యామిలీ.. పాత ఇంటికి తాళం వేసి వదిలేశారు. కొన్నేళ్లుగా ఖాళీగానే ఉంది. నాగులు పాత ఇంటిని గమనించిన నాగులు రెండో అల్లుడు వినోద్ కి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఇంటి చుట్టూ.. రాజుల కాలం నాటి కోట బురుజు గోడలు ఉండటం, ఇంటి పక్కనే పురాతన శివాలయం ఉండటం, బుధ్వేల్ కి నిజాం కాలం నాటి చారిత్రక నేపథ్యం ఉండటం తో.. మదిలో ఆలోచన మెదిలింది. ఆ ఇంట్లో కచ్చితంగా గుప్త నిధులు ఉంటాయి అనుకున్నాడు. స్నేహితులతో విషయాన్ని పంచుకున్నాడు. ఆశ పుట్టిన స్నేహితులు కూడా .. నిజమే అన్నారు. ఫ్రెండ్స్ లో ఒకరు.. తన దగ్గర గుప్త నిధులను పట్టించే మెషీన్ ఉందని.. దానితో చెక్ చేద్దామని అన్నాడు. దీంతో.. అనుకున్నదే తడువుగా ఆ ఇంట్లో మెషీన్ తో చెక్ చేశారు. నిజంగానే నిధులు ఉన్నట్లు మెషీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాము అనుకున్నదే తడువు… గుప్త నిధుల వేట మొదలు పెట్టారు. ఇంటి మొత్తాన్ని టెంట్ తో కవర్ చేశారు. పక్కన వాళ్లకు కూడా కనపడకుండా.. సైడ్ వాల్స్ తో కవర్ చేశారు. కేవలం రాత్రి వేళల్లోనే తవ్వకాలు జరిపారు. గుప్త నిధుల కోసం.. క్షుద్ర పూజలు జరిపినట్లు, జంతు బలి కూడా ఇచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండటం, ఏ ఫంక్షన్ లేకపోయినా .. టెంట్ వేయడం తో.. పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు స్థానికులు.

స్థానికుల ఫిర్యాదు తో ఇంటికి చేరుకున్న పోలీసులు… ఇంట్లో తవ్వకాలు జరుపుతుండగా నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు చెందిన 3 కార్లు, 16 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల వెనక బాబాలు ఎవరు లేరని. అత్యాశ తో వినోద్ స్నేహితుల తో కలిసి ఈ పని చేశాడని అన్నారు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. అక్కడ ఎలాంటి నిధులు దొరకలేదని అన్నారు. తవ్వకాలు జరిపిన నిందితుల హిస్టరీ చెక్ చేస్తున్నామని.. గతంలో కూడా ఎక్కడైనా గుప్త నిధుల పేరుతో తవ్వకాలు జరిపారని… ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!