Telangana: హైదరాబాద్ ను బీజేపీ నేతలు ప్రశాంతంగా ఉండనివ్వరా.. అసోం సీఎం టూర్ పై మంత్రి తలసాని స్ట్రాంగ్ కౌంటర్

అసోం (Assam) సీఎం హిమంత బిశ్వశర్మపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌ ప్రజలను రెచ్చగొట్టేందుకే ఆయనను ఇక్కడికి తీసుకువచ్చారని ఆరోపించారు. ఆయన భాష...

Telangana: హైదరాబాద్ ను బీజేపీ నేతలు ప్రశాంతంగా ఉండనివ్వరా.. అసోం సీఎం టూర్ పై మంత్రి తలసాని స్ట్రాంగ్ కౌంటర్
Talasani Srinivas Yadav
Follow us

|

Updated on: Sep 09, 2022 | 8:28 PM

అసోం (Assam) సీఎం హిమంత బిశ్వశర్మపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌ ప్రజలను రెచ్చగొట్టేందుకే ఆయనను ఇక్కడికి తీసుకువచ్చారని ఆరోపించారు. ఆయన భాష సరిగ్గా లేదన్న మంత్రి తలసాని.. అందుకే ఆయనను స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. గణేశ్ నిమజ్జనాల కోసం వచ్చిన అసోం సీఎం గణేషుడి గురించి లేదా శోభాయాత్ర గురించి మాట్లాడాలి కానీ రాజకీయాలు మాట్లాడటం సరికాదని సూచించారు. బీజేపీ (BJP) నేతలు హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని ప్రశ్నించారు. వినాయక నిమజ్జనాల కోసం హైదరాబాద్ వచ్చిన అసోం ముఖ్యమంత్రి కి నిరసన సెగ తగిలింది. ఎంజే మార్కెట్‌లో సభా వేదికపై ఆయన ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు అసోం సీఎం స్పీచ్‌ను అడ్డుకున్నారు. మైక్‌ లాక్కున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

ఘటన జరిగిన అనంతరం హిమంత బిశ్వశర్మ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క ఫ్యామిలీకే మంచి జరుగుతోందని అన్నారు. మిగిలిన అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలని, కేవలం ఒక్క కుటుంబం కోసమే కాదని చెప్పారు. మరోవైపు.. గణేశ్ నిమజ్జన వేడుకలు హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వివిధ ప్రాంతాలలోని వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై బారులు తీరాయి. భక్తుల జయజయధ్వానాలు, గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసరాలు మార్మోగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో