TS Rains:తెలంగాణ వాసులకు హై అలర్ట్‌.. నేడు, రేపు అతి భారీ వర్షాలు..

TS Rains:తెలంగాణ ప్రజలను వాతవారణ శాఖ అలర్ట్‌ చేసింది. శనివారం, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై...

TS Rains:తెలంగాణ వాసులకు హై అలర్ట్‌.. నేడు, రేపు అతి భారీ వర్షాలు..
File Photo
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 10, 2022 | 6:50 AM

TS Rains:తెలంగాణ ప్రజలను వాతవారణ శాఖ అలర్ట్‌ చేసింది. శనివారం, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలకు తోడు అల్ప పీడన ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో సాయంత్రం అయిందంటే చాలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం, భారీ వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతుండడంతోనే తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే విధంగా రానున్న 36 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఓడిశా తీరాలకు దగ్గరలోఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.

శనివారం నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 20.90 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..