GaneshNimajjanam: హుస్సేన్ సాగర్ చుట్టూ బారులు తీరిన గణనాథులు.. ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే?

Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో మార్మోగిపోతుంది. గణేశ్ నిమజ్జనానికి సిటీ నలుమూలల నుంచి ఇంకా వేల సంఖ్యలో గణనాథుడి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలి వస్తున్నాయి.

GaneshNimajjanam: హుస్సేన్ సాగర్ చుట్టూ బారులు తీరిన గణనాథులు.. ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే?
Ganesh
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2022 | 7:45 AM

Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో మార్మోగిపోతుంది. గణేశ్ నిమజ్జనానికి సిటీ నలుమూలల నుంచి ఇంకా వేల సంఖ్యలో గణనాథుడి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలి వస్తున్నాయి. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు . నిమజ్జనం సందర్భంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పై అడుగు అడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఏయే మార్గాల్లో ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలో తెలియజేస్తూ పోలీసులు రూట్ మ్యాప్ ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అంతేకాదు నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్యాంక్ బండ్ పై భక్తుల సందడితో కోలాహలంగా మారింది. గంగమ్మ చెంతకు గణనాథుడిని చేర్చేందుకు భారీగా తరలివచ్చారు. డప్పు సప్పులు, నృత్యాలు చేస్తూ భక్త పరవశంలో మునిగిపోయారు. భారీ గణనాథులు ట్యాంక్ బండ్ కు చేరుకోవంతో క్రేన్ల సాయంతో ప్రశాంతంగా నిమజ్జనంచేస్తున్నారు. బై బై గణేశా అంటూ నిమజ్జనం చేస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గురువారం నుంచి సాయంత్రం నుంచి నిమజ్జనం ప్రారంభం కాగా ఈ రోజు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. శుక్రవారం కావటం, భారీ వర్షం కురవడంతో నిమజ్జనం ఆలస్యంగా కొనసాగుతుంది. కాగా హుస్సేన్ సాగర్ చుట్టూ గణనాథులు బారులు తీరాయి. ట్యాంక్ బండ్, ఎన్టీ ఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా లో నిమజ్జనం కొనసాగుతోంది. నిన్న, రాత్రి వర్షం కారణంగా నిమజ్జనం ఆలస్యంగా సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. నిన్న దాదాపు హుస్సేన్ సాగర్ లో 20 -30 వేల వరకు విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఈవాళ మరో 10 వేల విగ్రహాల వరకు ఒక్క హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు