KTR Tweet: ‘ఈ నిరసన విధానం బాధ్యతారాహిత్యం’.. అసహనం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌. ఇంతకీ ఏం చేశారనేగా.

KTR Tweet: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఒకరు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ఇతర అంశాలపై కూడా స్పందిస్తుంటారు కేటీఆర్‌. ఇక సోషల్ మీడియా వేదికగా ఎవరైనా..

KTR Tweet: 'ఈ నిరసన విధానం బాధ్యతారాహిత్యం'.. అసహనం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌. ఇంతకీ ఏం చేశారనేగా.
KTR
Follow us

|

Updated on: Jul 06, 2021 | 7:10 PM

KTR Tweet: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఒకరు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ఇతర అంశాలపై కూడా స్పందిస్తుంటారు కేటీఆర్‌. ఇక సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వెంటనే స్పందించడం కేటీఆర్‌కు అలవాటు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. కొందరు నిరసనకారుల తీరు పట్ల కేటీఆర్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ నిరసన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం చేసింది కాదూ. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నిరసన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఓ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినా కేటీఆర్‌ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశాడనేగా..

వివరాల్లోకి వెళితే.. పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు పార్టీలకు చెందిన వారు దీనికి వ్యతిరేకంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే కొందరు నిరసనకారులు ట్యాంక్‌ బండ్‌లో బైక్‌, గ్యాస్‌ సిలిండర్‌లను వేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఇదే మంత్రి కేటీఆర్‌కు నచ్చలేదు. వీటికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన మంత్రి.. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన అనేది చాలా ముఖ్యమైంది. ఇది ప్రభుత్వాల, ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ బైక్‌లను, సిలిండర్‌లను నీటిలోకి వేయడం వంటివి మాత్రం బాధ్యాతరాహిత్యం’ అంటూ రాసుకొచ్చారు. ఇక అంతటితో ఆగకుండా.. ఆ నిరసనలో పాల్గొన్న వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీ అధికార పేజీని ట్యాగ్ చేశారు. మంత్రి ట్వీట్ చేయగానే పోలీసులు స్పందించారు. హుస్సేస్‌ సాగర్‌లో సిలిండర్‌, బైక్‌ను విసిరేసిన యూత్‌ కాంగ్రెస్‌, సీపీఐ ఉమెన్స్‌ వింగ్‌కు చెందిన వారిపై సెక్షన్‌ 277, 278, 341తో పాటు ఐపీసీ 290 కింద గాంధీ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

కేటీర్‌ చేసిన ట్వీట్‌..

Also Read: ఆ పెంపుడు సింహాన్ని ఆ యజమానికి ఇచ్చేయండి…అధికారులకు కాంబోడియా ప్రధాని ఆదేశం

Tokyo Olympics 2020: దేశ ప్రజలంతా మీ వెంటే.. మమ్మల్ని గర్వపడేలా చేయండి..! అథ్లెట్లలో స్ఫూర్తినింపిన మాస్టర్ బ్లాస్టర్

కరణ్ డైరెక్షన్లో మరో అందమైన ప్రేమ కథ.. రణవీర్ అలియా జంటగా రానున్న సినిమా..