TS High Court: ఫీజు చెల్లించలేదని ఆన్‌లైన్‌ తరగతులను ఆపుతారా.? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రశ్నించిన హైకోర్టు.

TS High Court: ఫీజు చెల్లించలేదని ఆన్‌లైన్‌ తరగతులను ఆపుతారా.? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రశ్నించిన హైకోర్టు.
Ts High Court

TS High Court: కరోనా కష్ట కాలంలోనూ కొన్ని పాఠశాలలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నాయి. పేరుకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నా అన్ని రకాల ఫీజులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. తాజాగా..

Narender Vaitla

|

Jul 06, 2021 | 7:38 PM

TS High Court: కరోనా కష్ట కాలంలోనూ కొన్ని పాఠశాలలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నాయి. పేరుకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నా అన్ని రకాల ఫీజులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. తాజాగా ఫీజులు చెల్లించలేదని ఓ పాఠశాల ఏకంగా 219 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను నిలిపివేయడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

వివరాల్లోకి వెళితే.. నగరంలోని బేగంపేట, రామంతాపూర్‌లోని హైదరాబాద్‌ పబ్టిక్‌ స్కూల్‌ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తుందని ఆరోపిస్తూ.. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ యాక్టివ్‌ పేరెంట్స్‌ ఫోరం అప్పీలు దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఫీజుల చెల్లించలేదన్న కారణంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 219 మంది విద్యార్థులకు 17 రోజులుగా ఆన్‌లైన్‌ తరగతులు బోధించడంలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ఫీజులు చెల్లించలేదని ఆన్‌లైన్‌ తరగతులు ఎలా ఆపుతారని ప్రశ్నించింది. ఈ చర్య.. పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఫీజులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని, తొలగించిన వారికి వెంటనే తరగతులను పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. లాభాపేక్ష లేకుండా పనిచేసే సొసైటీలు కూడా కార్పొరేట్‌ సంస్థల్లా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంత మంది విద్యార్థుల నుంచి, ఎంత మేరకు ఫీజులు రావాలో తమకు తెలపాలని హెచ్‌పీఎస్‌ను ఆదేశిస్తూ విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది. ఇక హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘ఈ విద్యా సంవత్సరం 10శాతం ఫీజు పెంపును ఉపసంహరించుకోవడంతో పాటు రూ.10వేలు తగ్గించినట్టు’ తెలిపారు.

Also Read: Taxes on Bitcoin: మీరు బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడుతున్నారా..! టాక్స్ ఎలా చెల్లించాలో తెలసుకోండి..!

KTR Tweet: ‘ఈ నిరసన విధానం బాధ్యతారాహిత్యం’.. అసహనం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌. ఇంతకీ ఏం చేశారనేగా.

Bodhan: ఒక్కటొక్కటిగా కదులుతున్నాయి.. నిన్న దర్భంగా.. ఇవాళ బోధన్ టు సౌదీ.. వయా పాకిస్తాన్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu