Bodhan: ఒక్కటొక్కటిగా కదులుతున్నాయి.. నిన్న దర్భంగా.. ఇవాళ బోధన్ టు సౌదీ.. వయా పాకిస్తాన్

దర్భంగా పేలుళ్ల ఘటనపై NIA విచారణ కొనసాగుతుండగా.. మరో చోట ఉగ్ర నీడ వెలుగు చూసింది. బోధన్‌లో ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయనే అనుమానంతో ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలతో..

Bodhan: ఒక్కటొక్కటిగా కదులుతున్నాయి.. నిన్న దర్భంగా.. ఇవాళ బోధన్ టు సౌదీ.. వయా పాకిస్తాన్
Isi
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 06, 2021 | 5:58 PM

దర్భంగా పేలుళ్ల ఘటనపై NIA విచారణ కొనసాగుతుండగా.. మరో చోట ఉగ్ర నీడ వెలుగు చూసింది. బోధన్‌లో ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయనే అనుమానంతో ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ సౌదీ అరేబియాలో అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. నేరుగా ఇండియాకు వచ్చేసినట్టు తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎయిర్‌పోర్ట్‌ దిగడంతోనే పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అతని నుంచి టెర్రరిస్టు లింకుల సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు కౌంటర్ ఇంటెలిజన్స్ అధికారులు.. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొన్నారు. సౌదీలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే కారణంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. సౌదీలో ఉన్న సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అరెస్టయ్యాడు.

బెయిల్‌పై విడుదలైన తర్వాత అతను పరారీలో ఉన్నాడు. ఇండియాకు వచ్చినట్టుగా పోలీసులు సమాచారం అందడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఇమ్రాన్, నాసిర్ అనే ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి: Srisailam Drones: శ్రీశైలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లు..! అసలు విషయం అదేనా..!

Sonu Sood-KTR: మంత్రి కేటీఆర్‌ను కలిసిన రియల్ హీరో సోనూ సూద్‌.. ఫోటోలు చూడండి..