Sonu Sood-KTR: మంత్రి కేటీఆర్‌ను కలిసిన రియల్ హీరో సోనూ సూద్‌.. ఫోటోలు చూడండి..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jul 06, 2021 | 4:25 PM

సోనూ సూద్‌..సోనూ సూద్‌...సోనూ సూద్‌..కరోనా సమయంలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపించింది.. ఇప్పటికీ వినిపిస్తుంది. సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహు భాషా నటుడు..

Sonu Sood-KTR: మంత్రి కేటీఆర్‌ను కలిసిన రియల్ హీరో సోనూ సూద్‌.. ఫోటోలు చూడండి..
Sonu Sood Meets Minister Kt

Follow us on

సోనూ సూద్‌..సోనూ సూద్‌…సోనూ సూద్‌..కరోనా సమయంలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపించింది.. ఇప్పటికీ వినిపిస్తుంది. సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహు భాషా నటుడు సోనుసూద్ ఈరోజు తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్లో కలిశారు. సోనూ సూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి KTR అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోను సూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Sonu Sood Minister Ktr

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఓ ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు మంత్రి KTR. సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌తో పంచుకున్నారు.

Sonu Sood Ktr

తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు హైదరాబాద్‌తో తన అనుబంధాన్ని సోనూసూద్ గుర్తుచేసుకున్నారు. సమావేశానంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్‌ లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా సత్కరించి.. మేమొంటో అందజేశారు.

ఇవి కూడా చదవండి: Lockdown: మళ్లీ విరుచుకుపడిన కరోనా రక్కసి.. ఆ రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్

PMFBY: మీ పంట రక్షణ కోసం ఆందోళన చెందుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu