Lockdown: మళ్లీ విరుచుకుపడిన కరోనా రక్కసి.. ఆ రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్

Lockdown: మళ్లీ విరుచుకుపడిన కరోనా రక్కసి.. ఆ రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్
Assam Announces Complete Lo

కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అధిక కోవిడ్ కేసులు బయటపడుతున్న జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ పెట్టాలని నిర్ణయించింది.

Sanjay Kasula

|

Jul 06, 2021 | 3:42 PM

అసోంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అధిక కోవిడ్ కేసులు బయటపడుతున్న జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ పెట్టాలని నిర్ణయించారు. ఈ రోజు రాత్రి నుంచే సంపూర్ణ స్థాయిలో కఠిన లాక్‌డౌన్‌ అమలులోకి రానుంది. ఇది మరో 10 రోజుల వరకు కొనసాగనుంది. మొత్తం ఏడు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్ణయించింది. ప్రభుత్వం  జారీ చేసిన ఆదేశాల ప్రకారం గోల్‌పారా, గోలఘాట్, జోర్హాట్, సోనిత్‌పూర్, బిశ్వనాథ్, లఖింపూర్, మొరిగావ్‌లు కఠిన నిబంధనలు అమలు జరుగుతాయి. శివసాగర్, దిబ్రుగరహ్ అనే మరో రెండు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆ జిల్లాల్లో కూడా త్వరలోనే సంపూర్ణ లాక్‌డౌన్ పెట్టేందుకు  పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ లాక్‌డౌన్‌ సమయంలో కేవలం పాలు, మందుల దుకాణాలు వంటి అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. దీంతో వారం రోజులకు సరిపడా సరుకులు, కూరగాయలను కొనుగోలు చేసేందుకు ప్రజలు దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు.

సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా వేలాదిమంది నగర వాసులు, వలస కార్మికులు తమ సొంతూళ్ళకు తరలి వెళ్ళారు. వీరికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నగర, దూర ప్రాంతాలకు బస్సులను నడిపింది. ఇంకోవైపు వారం రోజుల పాటు మాంసాహారం రుచి చూసేందుకు అవకాశం లేకపోవడంతో మాంసం దుకాణాల వద్ద కూడా ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు.

అదేసమయంలో ఈ లాక్‌డౌన్‌ వేళ బయట తిరిగిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని  పోలీసులు హెచ్చరించారు. నగరంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా 20 వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

అలాగే, నగర వ్యాప్తంగా 220కి పైగా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. అదేవిధంగా వీధులు, క్రాస్‌ వీధులు, ప్రధాన రహదారులను కూడా మూసివేసి, నగర వాసులు బయట తిరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి: PMFBY: మీ పంట రక్షణ కోసం ఆందోళన చెందుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Fish Pond: చేపలందు ఈ చెరువులోని చేపలే వేరు.. తండోపతండాలుగా తరలివస్తున్న జనాలు.. అసలు విషయం ఏంటంటే..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu