AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMFBY: మీ పంట రక్షణ కోసం ఆందోళన చెందుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY-PM ఫాసల్ బీమా యోజన) కింద రైతులు తమ పంటలను జూలై 31 వరకు బీమా చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (AIC)...

PMFBY: మీ పంట రక్షణ కోసం ఆందోళన చెందుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
Pm Fasal Bima Yojana 2021
Sanjay Kasula
|

Updated on: Jul 06, 2021 | 2:58 PM

Share

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY-PM ఫాసల్ బీమా యోజన) కింద రైతులు తమ పంటలను జూలై 31 వరకు బీమా చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (AIC)వెల్లడించిన దాని ప్రకారం.. ఖరీఫ్ సీజన్లో 10 పంటలకు బీమా చేయవచ్చు. వీటిలో వరి, జొన్న , బజ్రా, పెసరు,  మొక్కజొన్న, మినుములు, అర్హార్, నువ్వులు, సోయాబీన్‌తోపాటు వేరుశనగ వంటి పది రకాల పంటలను బీమా చేసుకునే అవకాశం ఉంది. మీరు మీ పంటలను ప్రమాదాల నుంచి రక్షణ కోరుకున్నట్లైతే రాబోయే మరో 24 రోజుల్లో బీమా పథకంలో చేరండి.

ప్రకృతి విపత్తులు, కరువు, కొండచరియలు, అగ్ని ప్రమాదాలు, తుఫాను, వడగండ్ల తుఫాను వంటి ప్రక‌ృతి విపత్తుల సంబంవిచినప్పుడు జరిగే పంట నష్టం నుంచి రక్షణ లభిస్తుంది. ఈ పథకంకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చింది. రైతులు బీమా చేసిన మొత్తంలో 2శాతం ప్రీమియం మాత్రమే చెల్లించాలి.

భీమా పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి…

మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉందో అదే బ్యాంకులో ఈ బీమాను పొందే అవకాశం ఉంది. ఈ సౌకర్యం సహకార సంఘాల్లో కూడాడ లభిస్తోంది. ఈ సదుపాయాన్ని కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ నుండి పొందవచ్చు. ఇది క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ నుండి కూడా పొందవచ్చు. ఈ సౌకర్యం AIC అధీకృత ప్రతినిధి(ఏజెంట్) లేదా సంబంధిత కార్యాలయంలో కూడా బీమాను తీసుకోవడానికి అవకాశం ఉంది.

రైతులకు ఎంత లాభం…

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పిన లెక్కల ప్రకారం  PM ఫసల్ బీమా యోజన రైతులకు లాభదాయకమైన ఒప్పందం. జాతీయ స్థాయిలో ఈ పథకం ప్రారంభ అయినప్పటి నుంచి (13 జనవరి 2016) డిసెంబర్ -2020 వరకు రైతులు సుమారు 19 వేల కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించారు. దీనికి ప్రతిఫలంగా వారు సుమారు 90 వేల కోట్ల రూపాయలను క్లెయిమ్‌గా చేసుకున్నారు. అందువల్ల రైతు ఇందులో చేరి తమ పంటలకు జరిగే ప్రక‌ృతి విపత్తుల నుంచి కాపాడుకుంటున్నాడు.

ఇప్పటికే కోట్ల మంది రైతులు చేరారు…

ఇప్పుడు ప్రభుత్వం PM ఫసల్ బీమా పథకాన్ని స్వచ్ఛందంగా చేసింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం రైతు అనుమతి లేకుండా బీమా చేయలేరు. ఇంతకుముందు ఈ పరిస్థితి లేదు. ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) తీసుకునే వారిని బలవంతంగా ఈ బీమా చేయించేవారు. అంతే కాకుండా.. ప్రీమియంను వారు పొందిన రుణ మొత్తం నుండి తీసుకునేవారు. స్వచ్ఛందంగా చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 5.5 కోట్లకు పైగా రైతులు ఈ పథకంలో చేరుతున్నారు.

ఇవి కూడా చదవండి: Fish Pond: చేపలందు ఈ చెరువులోని చేపలే వేరు.. తండోపతండాలుగా తరలివస్తున్న జనాలు.. అసలు విషయం ఏంటంటే..

తుదిదశకు కేబినెట్ విస్తరణ కసరత్తు? కీలక సమావేశం రద్దు.. ఢిల్లీకి చేరుకుంటున్న ఎంపీలు

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..